Home రాజకీయాలు ఏపి వార్తలు జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ys jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా పాలన వికేంద్రీకరణ మరియు సీఆర్డీఏ రద్దు అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను  అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గత నెల ఏపీ హైకోర్టు ఇచ్చినా స్టేను నిలిపివేయాలని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను  స్వీకరించిన న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. ఈ పిటిషన్‌ను  విచారించిన జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాలను వాదనను తోసిపుచ్చింది. కేసు హైకోర్టులో ఉండగా మధ్యలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చేసింది. రాజధాని అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. దీంతో జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది.

కేసు విచారణ సమయంలో సుప్రీం కోర్ట్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాజధాని అంశం గురువారం హైకోర్టులో విచారణ ఉండగా ఈ సమయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ఎంతవరకు సబబు అని కోర్టు ప్రశ్నించింది. కనీసం నిర్ణీత సమయంలో విచారణ జరిపేలా హైకోర్టుకు అదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. అయితే కేసు విచారణకు నిర్ణీత సమయం నిర్దేశించడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. ఏ కేసును కోర్టు నిర్ణీత కాలం కేటాయించలేదని అలా కేటాయించినప్పుడు న్యాయ ప్రక్రియ దెబ్బతింటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థన తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. వీలైనంత వేగంగా కేసు విచారణ పూర్తి చేసి తుది తీర్పును జారీ చేయాలని సుప్రీంకోర్టును ఏపీ హైకోర్టును ఆదేశించింది. కాగా ఈ గురువారం రాజధాని అంశం  హైకోర్టులో విచారణకు రానున్నాయి. రాజధాని అంశం మొదట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం వద్దకు వెళ్ళింది…ఆ తర్వాత జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌ ధర్మాసనం ముందుకు విచారణకు రాగా సాంకేతిక కారణాలతో ఈ పిటిషన్ జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ ధర్మాసనం ఈ పిటిషన్‌‌పై విచారణ జరిపింది. ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణ బిల్లు పై అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad