తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రుల ఎంపికలోనే కాదు.. శాఖల కేటాయింపులోనే తనదైనశైలి మార్క్‌ను చూపించారు. వ్యవసాయం, ఆరోగ్యం, పంచాయతీరాజ్శాఖతోపాటు పలుశాఖలను మంత్రులకు అప్పగించారు. అయితే కీలకమైన ఆర్థికశాఖతోపాటు, నీటిపారుదల, ఐటీశాఖలను సీఎం కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు. శుక్రవారం నాడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను కూడా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టబోతున్నారు.
దాదాపు రెండు నెలల తరువాత తెలంగాణ కేబినేట్‌ను విస్తరించిన సీఎం కేసీఆర్ కొత్తగా పది మందికి అవకాశం కల్పించారు. వీరిలో ఎక్కువ మంది తొలిసారి మంత్రులు అయి నవారే ఉన్నారు. దీంతో సీఎంతో కలిపి మంత్రుల సంఖ్య 12కు చేరింది. మంత్రుల ఎంపికలోనే కాకుండా, శాఖల కేటాయింపుల్లోనూ ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ వ్యవరించారు.
మొన్నటి వరకు మంత్రులుగా పనిచేసిన వారికి శాఖలను మార్చారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్‌కు ఆరోగ్యశాఖను అప్పగించారు. మొన్నటి వరకు మిషన్ భగీరథ చైర్మన్‌గా వ్యవహరించిన వేముల ప్రశాంత్‌రెడ్డికి రవాణా, రోడ్లు భవనాలశాఖను కేటాయించారు. ప్రశాంత్‌రెడ్డికి శాసనసభ వ్యవహరాల బాధ్యతలను అప్పగించారు.
ఇక వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి వ్యవసాయశాఖ బాధ్యతలను అప్పచెప్పారు. కొప్పుల ఈశ్వర్‌కు సంక్షేమం, ఇంద్రకరణ్‌రెడ్డికి న్యాయ, అటవీ, ఎండోమెంట్శాఖలను అప్పగించారు. జగదీశ్వర్‌రెడ్డికి విద్య, మల్లారెడ్డికి కార్మికశాఖనలు అప్పచెప్పారు. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పంచాయతీరాజ్, శ్రీనివాస్‌గౌడ్‌కు ఎక్సైజ్‌శాఖతోపాటు యువజన, క్రీడా శాఖలను కేటాయించారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పశు సంవర్ధకశాఖ బాధ్యతలను అప్పచెప్పారు. రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. బడ్జెట్ ఆమోదంతోపాటు ఇతర అంశాలపైనా చర్చ జరగనుంది. శుక్రవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని సీఎంఓ కార్యాలయ సమాచారం.