Home రాజకీయాలు జాతీయ వార్తలు కేరళ విమాన ప్రమాదానికి కారణం ఇదే : సంచలన నిజాలు

కేరళ విమాన ప్రమాదానికి కారణం ఇదే : సంచలన నిజాలు

kerala flight accident

వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుండి కోజికోడ్ విమానాశ్రయానికి చేరిన బోయింగ్ 737 విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, మృతుల్లో ఇద్దరు పైలట్లు సహా ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వందమందికిపైగా గాయపడ్డారు. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి, 35 అడుగుల లోయలో పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఈ దుర్ఘటనకు సంబంధించిన సంచలన నిజాలు వెలుగు చూశాయి. ల్యాండింగ్ సాఫీగా జరిగినప్పటికీ విమానం ప్రమాదానికి ప్రధాన కారణం టేబుల్ రన్‌వే అని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. టేబుల్ రన్‌వే అంటే ఇరువైపుల లోయ మధ్యలో రన్‌వే ఉంటుంది. ఇటువంటి నిర్మాణాలు ఎత్తైన పీఠభూమి ఉండే ప్రాంతాల్లో కనిపిస్తాయి. అందుకే ఇటువంటి రన్‌వే పై విమానం ల్యాండింగ్ చేసే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సుదీర్ఘ అనుభవం ఉన్న పైలెట్లు మాత్రమే ఇటువంటి ల్యాండ్ నిర్వహించగలరు.

బోయింగ్ 737 నడిపిన పైలెట్లు అపార అనుభవం ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం జరగడం అందర్నీ కలచివేసింది. అయితే ల్యాండింగ్ కు ముందు కోజికోడ్‌లో భారీ వర్షం పడింది. దీంతో రన్‌వే స్పష్టంగా కనిపించకపోవడం, రన్‌వే జారుడు స్వభావం కలిగి ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటువంటి విమానాశ్రయాలు భారతదేశంలో మరో రెండు ఉన్నాయ. లేహ్‌,మంగళూరు విమానాశ్రయాలు ఈ తరహకు చెందినవే. 2010లో మంగళూరు విమానాశ్రయంలో ఇటువంటి ప్రమాద సంఘటన జరిగి 158 మంది ప్రయాణికులు మరణించారు. అందుకే ఈ రెండు రన్ వే లపై ల్యాండింగ్ అత్యంత సంక్లిష్టమైనది, ఏమాత్రం అదుపుతప్పిన ఘోర ప్రమాదం జరిగే అవకాశం ఉంది.మరోవైపు కోజికోడ్ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా! ప్రమాద సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది పిల్లలు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad