Home రాజకీయాలు జాతీయ వార్తలు రామజన్మభూమి ట్రస్ట్ ఛీఫ్‌కు కరోనా పాజిటివ్

రామజన్మభూమి ట్రస్ట్ ఛీఫ్‌కు కరోనా పాజిటివ్

Rama Janmabhoomi Trust Chief Tested Corona Positive

ఇటీవల అయోధ్య రామమందిర నిర్మాణానికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోది శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ అపూర్వ ఘట్టాన్ని కోట్లాది మంది తమ టీవీలకు అతుక్కుపోయి వీక్షించారు. కాగా ఈ ఘట్టంలో అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ఛీఫ్ నృత్యగోపాల్ దాస్ కూడా మోదీతో కలిసి పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణమే తమ ధ్యేయమని, అతి త్వరలో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి, నిర్విరామంగా నిర్మాణ పనులు చేపడతామని ఆయన వెల్లడించారు.

అయితే తాజాగా రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ నృత్యగోపాల్ దాస్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానంద్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపనలో పాల్గొన్న నృత్యగోపాల్ దాస్ ఇటీవల శ్రీకృష్ణా్ష్టమి వేడుకల్లో పాల్గొనేందుకు మధురకు వెళ్లారని, అక్కడ ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కరోనా పరీక్షలు నిర్వహించినట్లు యోగి తెలిపారు.

కాగా కరోనా పాజిటివ్‌గా తేలడంతో డాక్టర్ల సలహా మేరకు ఆయన్ను మథుర నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులతో యూపీ సీఎం స్వయంగా మాట్లాడి నృత్యగోపాల్ దాస్‌కు ప్రత్యేక చికిత్స అందించాలని కోరడం జరిగింది. కాగా అయోధ్య రామ మందిర నిర్మాణ శంకుస్థాపన రోజున వేదికపై ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్‌ను నృత్యగోపాల్ దాస్ నేరుగా కలిశారు. దీంతో ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad