ప్రధాని మోధి నన్ను, నా కుటుంబాన్ని అలాగే నా కాంగ్రెస్ పార్టీని కూడా అవమానించారు కానీ నాకు మాత్రం అతడిపై కోపం లేదు.. నా ప్రేమతోనే అతడిపై విజయం సాదిస్తా. అంటూ మోధిపై మరోసారి ప్రేమను కురిపించారు రాహుల్ గాంధీ. మనిషి ద్వేషాన్ని ఒక ప్రేమ మాత్రమే జయించగలదని.. అందుకే తాను ప్రధానిని పార్లమెంటులో కౌగిలించుకున్నానని గతాన్ని మరోసారి గుర్తుచేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.
గురువారం రాజస్థాన్లో “ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవా దళ్” కార్యక్రమానికి ఆయన హాజరై కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు రాహుల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రధాని మోధి జీ నన్ను, నా కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని అవమానించారు. మాకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారు. కానీ నేను మాత్రం పార్లమెంటులో ఆ పెద్దమనిషిని కౌగిలించుకున్నాను. మనిషి ద్వేషాన్ని ఒక్క ప్రేమ మాత్రమే జయించగలదు. మోధి గారు నన్ను ఇప్పటికీ ద్వేషిస్తున్నారు. ఆయన ద్వేషానికి నేను ప్రేమను కౌంటర్ గా వేస్తున్నాను” అంటూ మోధికి కౌంటర్ వేశారు రాహుల్.