Home రాజకీయాలు జాతీయ వార్తలు ఆ రాష్ట్రంలో ఉచితంగా స్మార్ట్ ఫోన్ల పంపిణి

ఆ రాష్ట్రంలో ఉచితంగా స్మార్ట్ ఫోన్ల పంపిణి

Mobile education

కరోనా కారణంగా విద్య వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యింది. ఇప్పటికే జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పరీక్షలు పూర్తిగా రద్దు కాగా మరికొన్నింటిని వాయిదా వేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ ఆధారిత తరగతులను ప్రారంభించాయి. ఈ సెప్టెంబరు నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని అనేక రాష్ట్రాలు ప్రకటించాయి. అయితే కరోనా ముప్పు ఇంకా పొంచి ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లలను అందిస్తున్నట్లు కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటికే క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి విడతగా రాష్ట్రంలోని 1.75 లక్షల మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే 50వేల ఫోన్లను తెప్పించారు. ఈ స్మార్ట్ ఫోన్ లను ప్రభుత్వం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి విద్యార్థులకు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం విద్యార్థులకు ఎంతో మేలు కలగనుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ ఫోన్లో పంపిణీ దశలవారీగా జరగనుందని పంజాబ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad