Home రాజకీయాలు జాతీయ వార్తలు అయోధ్య రాముడిని దర్శించుకంటానంటోన్న పాక్ క్రికెటర్

అయోధ్య రాముడిని దర్శించుకంటానంటోన్న పాక్ క్రికెటర్

Pakistan Cricketer Wants To Visit Ayodhya Ram Mandir

భారతీయలందరూ ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎట్టకేలకు తొలి అడుగు పడింది. ఆగస్టు 5న భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో కోట్లాది భక్తులు హర్షం వ్యక్తం చేశారు. చాలా మంది ఈ వేడుకను టీవీల్లో చూస్తూ పరవశించిపోయారు. ఇక వీలైనంత త్వరగా ఈ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ నిర్మాణ కమిటీ రెడీ అవుతోంది.

అయితే అయోధ్య రామ మందిర నిర్మాణం మొదలుకావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పాకిస్థాన్‌కు చెందని క్రికెటర్ డానిష్ కనేరియా అంటున్నాడు. అదేంటీ.. పాకిస్థాన్ క్రికెటర్ ఇలా అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడుతుండటంతో అందరూ అవాక్కవుతున్నారు. ఇక తనకు అయోధ్య రామ మందిరాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలని ఉందని, ఆగస్టు 5న మోదీ శంకుస్థాపనను తాను టీవీలో చూసి మురిసిపోయానంటూ చెప్పుకొచ్చాడు.

పాకిస్థానీ అయినా తనకు హిందువు మతం అంటే అపార భక్తిభావం ఉందని, తాను కూడా హిందువునేనని చెప్పుకొచ్చాడు ఈ క్రికెటర్. ఇక డానిష్ కనేరియా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా డానిష్ కనేరియా చేసిన ట్వీట్‌కు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. హిందువు అయిన ఆయన ఖచ్చితంగా అయోధ్య రామమందిరాన్ని వీక్షించాలని వారు అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad