Home రాజకీయాలు క‌ళ్లు లేక‌పోయినా చ‌దువులో ప‌‌రుగులు పెట్టేస్తున్న చిన్నారి

క‌ళ్లు లేక‌పోయినా చ‌దువులో ప‌‌రుగులు పెట్టేస్తున్న చిన్నారి

oviya blind child

క‌ళ్లు లేక‌పోతే ఆ వ్య‌క్తి ప‌డే బాధ అంతా ఇంత కాదు. క‌ర్ర సాయంతో ప‌ది అడుగులు కూడా స‌రిగా వేయ‌లేం. ఎవ‌రో బాగా అనుభ‌వం ఉన్న‌వాళ్లు త‌ప్ప‌. అంటే న‌డ‌‌‌‌వ‌డ‌మే క‌ష్టం. ప్ర‌తీదానికీ ఎవ‌రో ఒక‌రి సాయం తీసుకోవాల్సి వ‌స్తుంది. మ‌రి క‌ళ్లు లేకుండా చ‌ద‌వ‌డం అంటే….బాబోయ్ అది ఊహించ‌డానికి క‌ష్టం క‌దా. లూయి బ్రెయిల్ లిపి ద్వారా చాలా మంది అంధులు చ‌దువుతున్నారు. కానీ ఒక అమ్మాయి మాత్రం ఆ లిపితో ప‌ని లేకుండా ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివింది. అంతేకాదు…దాదాపు 70 శాతం మార్కుల‌ను సాధించింది. త‌ల్లిదండ్రుల స‌హాయ‌స‌హ‌కారాలు, టెక్నాల‌జీ అందించిన సాఫ్ట్ వేర్ సాయంతో ఈ ఘ‌న‌త‌ను సాధించింది. ఈ అమ్మాయి పేరు ఓవియా. త‌మిళ‌నాడుకు చెందిన ఈ బాలిక‌కు…తాను మూడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న స‌మ‌యంలోనే కంటి చూపును కోల్పోయింది. బోర్డుపై రాసిన అక్ష‌రాలు కూడా క‌నిపించేవి కావు. దీంతో ఏం చేయాలో అర్ధంకాక‌..టెక్నాల‌జీని అండ‌గా చేసుకుంది. అప్పటి నుంచి ల్యాప్ టాప్ వాడ‌టంపై ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంది. త‌న‌కు ఏడవ త‌ర‌గ‌తి వ‌చ్చే స‌మయానికి క్లాస్ లో ……లాప్ టాప్ వాడేందుకు టీచ‌ర్లు అనుమ‌తి ఇచ్చారు. లాప్ ట్యాప్ స‌హాయంతో ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసింది. ఇక క్లాసులు విష‌యానికొస్తే త‌మిళ‌, గ‌ణితం త‌ప్పితే మిగ‌తా స‌బ్జెక్టుల అన్నింటికీ నోట్స్ లాప్ ట్యాప్‌లోనే రాసుకునేదాన్ని. త‌మిళ క్లాసును మాత్రం బాలిక అమ్మ రికార్డు చేసి పెట్టేది. ఇక నాన్నగ‌ణితంలో శిక్ష‌ణ ఇచ్చారు.

త‌మ బిడ్డ‌కి రెటీనాల్ పిగ్మెంటేసో అనే వ్యాధి సోకింద‌ని వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి వ‌ల్ల క్ర‌మంగా చూపును కోల్పోయింది. వైద్యులు చెప్పిన ఆ మాట‌లు విని….ఓవియా త‌ల్లిదండ్రులు చాలా బాధ‌ప‌డ్డారు. కానీ ఎట్టి ప‌రిస్థితుతెలుసుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఆ క్ర‌మంలోనే సాఫ్ట వేర్‌ల‌పై దృష్టి పెట్టారు. వాటిపై ఆమెకు శిక్ష‌ణ ఇచ్చారు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ఓవియా టైపు చేసే అక్ష‌రాలు….. ఆమెకు వినిపిస్తాయి. చ‌దువుకోవ‌డానికి ల్యాప్ టాప్ ఎలా ఉప‌యోగించాలో తెలుసుకోవ‌డంతో బాలిక‌లో ఆత్మ‌విశ్వాసం పెరిగింది. అంతేకాదు….అంద‌రితోపాటు చ‌దువ‌కోవ‌డం కోసం ఈ ల్యాప్ టాప్ బాగా ఉప‌యోగప‌డింది. టీచ‌ర్లు కూడా త‌న‌కు బాగా స‌హాయ‌ప‌డ్డార‌ని చెబుతున్నారు. చాలా కాలం ప్రాక్టీస్ త‌ర్వాత ఓవియా ఈ స్థాయికి చేరింది. ఇప్పుడు అంద‌రి పిల్ల‌ల్లా చ‌దువుకోగ‌లుగుతోంది. త‌ల్లిగా ముందు తామే ఆత్మ‌విశ్వాసంతో ఉండాల‌ని…అప్పుడే పిల్ల‌ల్లో ఆత్మ‌విశ్వాసం పెరుగుతోంద‌ని అంటోంది ఓవియా త‌ల్లి. ఇప్పుడు తాము చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నామ‌ని చెబుతోంది. నిజంగా క‌ళ్లు ఉండి కూడా చాలా మంది ఏమీ చేయ‌లేక‌పోతున్న రోజుల్లో…క‌ళ్లు లేకుండా విద్యారంగంలో దూసుకుపోతున్న ఓవియా ఎంతో మందికి ఆద‌ర్శం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad