Home రాజకీయాలు రామ‌మందిరం కోసం 28 ఏళ్ల ఉప‌వాస దీక్ష చేసిన అప‌ర‌భ‌క్తురాలు

రామ‌మందిరం కోసం 28 ఏళ్ల ఉప‌వాస దీక్ష చేసిన అప‌ర‌భ‌క్తురాలు

negi 2

మ‌న‌లో చాలా మంది ఒక్క రోజు ఉప‌వాసం చేయాలంటేనే అల్లాడిపోతుంటారు. చాలా మంది ఉండ‌లేరు.మ‌రి అలాంటిది 28 ఏళ్ల పాటు ఉప‌వాసం ఉండ‌టం అంటే…అందులోనూ 80 ఏళ్ల వృద్ధురాలు ఈ ప‌ని చేసిందంటే….అమ్మో వింటానికే ఎంతో ఆశ్చ‌ర్యంగా ఉన్నా…..ఇది నిజంగానే జ‌రిగింది.
దాదాపు 28 ఏళ్ల వరకు ఉపవాసం ఉన్న ఒక 82 ఏళ్ల వృద్ధురాలు…….. తన ఉపవాసాన్ని విర‌మించేందుకు రెడీ అయ్యారు. అందుకు కారణం అయోధ్యలోని రామ మందిరానికి సంబంధించిన వివాదం. మధ్యప్రదేశ్ కి చెందిన ఊర్మిళాదేవి ప‌ర‌మ రామ భక్తురాలు. అనునిత్యం శ్రీరామ‌నామ జ‌ప‌మే చేస్తుండేది. ప్ర‌తీ రోజూ సీతారాముల ప‌టాల‌కు, విగ్ర‌హాల‌కు పూజాధి కార్య‌క్ర‌మాలు చేస్తుండేది. 1992లో బాబ్రీ మసీద్ కి రామ మందిరానికి మధ్య వివాదాలు అవ్వడంతో ……..ఆమె మ‌న‌సు చిన్న‌బోయింది. చాలా బాధ‌ప‌డింది. మళ్లీ రామ మందిరం తిరిగి గుర్తింపు లోకి వచ్చేంతవరకు…… తినను అని ఉపవాస దీక్ష చేపట్టారు ఊర్మిళాదేవి. ఆ రోజు నుంచి ఆహారం తీసుకోవ‌డం లేదు. కేవ‌లం పండ్లు, ప‌చ్చి కూర‌గాయ‌లు, నీరే ఆహారం. అలా 1992 నుంచి 2020 వ‌ర‌కు ఉప‌వాస దీక్ష పాటిస్తూ వ‌చ్చింది.

ఆ వివాదానికి ఇటీవ‌ల సుప్రీంకోర్టు ద్వారా ప‌రిష్కారం రావ‌డం…రామ మందిర నిర్మాణానికి విరాళాలు రావ‌డం…భూమి పూజ కూడా అవ్వ‌డంతో …ఊర్మిళా దేవి ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి. తాను 28 ఏళ్లుగా కొన‌సాగిస్తున్న ఉప‌వాస దీక్ష‌ను విర‌మించాల‌ని నిర్ణ‌యించుకుంది. అంతే కాదు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అయోధ్య రామ‌మందిర ప్రాంతాన్ని సంద‌ర్శించాల‌ని ఉవ్విళ్లూరుతోంది. అయితే కొవిడ్ కార‌ణంగా రామ‌మందిర ప్రాంతాన్ని భ‌క్తురాలు ఊర్మిళాదేవి సంద‌ర్శించ‌లేక‌పోతుంది. ఆగస్టు 5న అయోధ్యలోని రామ మందిరం లో జరగబోతున్న శిలన్యాల ఉత్సవాలకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఆ ఉత్సవాలకు హాజరయ్యి శ్రీ రాముని దర్శనం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. ఆ త‌ర్వాత సరయూ నది దగ్గర తన ఉపవాస దీక్షను విరమించుకుంటాన‌ని అంటోంది. ఊర్మిళా దేవి ఉప‌వాస దీక్ష‌ను విర‌మించ‌డంతో…ఆమె కుటుంబ‌స‌భ్యులు ఆనంద ప‌డుతున్నారు. ఆమెతో క‌లిసి మ‌ళ్లీ భోజ‌నం చేయాల‌ని ఎదురుచూస్తున్నారు. ఎప్పుడైతే రామమందిర నిర్మాణానికి మద్దతు ఇస్తూ సుప్రీం కోర్టు తన తీర్పును విడుదల చేసిందో ……అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని, ఇంకా జడ్జి లని ఊర్మిళాదేవి తన లేఖల ద్వారా అభినందించారు. ఈ విష‌యాన్ని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ త‌న ట్విట్టర్ ద్వారా తెలిపాడు. నిజంగా భ‌క్తిలో శ‌బ‌రికి ఏమాత్రం తీసిపోని విధంగా రామ‌భ‌క్తురాలు ఊర్మిళాదేవి చేసిన ఉప‌వాస దీక్ష ఎంతో మంది భ‌క్తుల‌కు ఆద‌ర్శ‌మ‌నే చెప్పాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad