Home రాజకీయాలు జాతీయ వార్తలు కారు కంటే గేదె కొన్నప్పుడే ఎక్కువ సంతోషం: సోనూ సూద్

కారు కంటే గేదె కొన్నప్పుడే ఎక్కువ సంతోషం: సోనూ సూద్

sonu sood helps again

ప్రజలకు ఇబ్బంది వస్తే ప్రభుత్వానికి చెప్పుకునే రోజులు పోయాయి. ఇప్పుడు తమ సమస్యలు ప్రముఖ నటుడు సోనూసూద్‌కి చెప్పుకుంటున్నారు చాలామంది ప్రజలు. సోషల్ మీడియా ద్వారా ఆయనకు సమస్యను తెలియజేస్తే చాలు.. క్షణాల్లో సహాయం చేసేస్తున్నాడు. దీంతో చాలామంది తమ సమస్యలను ప్రభుత్వం, అధికారులకు చెప్పుకునే బదులు సోనూసూద్‌కి చెప్పుకుంటున్నారు. తమకు సహాయం చేయండంటూ తనకు రోజూ 30 వేల మంది మెసేజ్‌లు పెడుతున్నట్లు తాజాగా సోనూసూద్ తెలిపాడు. వారిలో వీలైనంత మందికి సహాయం చేస్తానన్నాడు.

లాక్‌డౌన్‌ సమయంలో వేలమంది వలస కార్మికులకు భోజనం పెట్టి తమ సొంత ప్రాంతాలకు పంపడంతో మొదలైన సోనూసూద్ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సమస్యల్లో ఉన్న వేలమందికి సోనూసూద్ సహాయం చేయగా.. సహాయం పొందిన వారు ఆయనను దేవుడిగా అభివర్ణిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో సోనూసూద్‌ని కలియుగ కర్ణుడుగా నెటిజన్లు పేర్కొంటున్నారు.

అయితే తాజాగా సోనూసూద్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. బిహార్ చంపారన్‌లోని భోలా గ్రామానికి చెందిన ఒక కుటుంబం తమకు ఏకైక ఆదాయ వనరు అయిన బ‌ర్రెను కోల్పోయింది. దీంతో తమకు కొత్త బర్రెని కొనివ్వాలని సోనూసూద్‌ను కోరారు. దీంతో సోనూసూద్ వెంటనే వారికి కొత్త బర్రెను కొనిచ్చాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌లో వెల్లడించిన సోనూసూద్.. ‘వారి కోసం కొత్త బ‌ర్రెను కొన్నప్పుడు క‌లిగిన ఆనందం, నా తొలి కారు కొన్నప్పుడు క‌ల‌గ‌లేదు’ అని ట్వీట్ చేశాడు. బీహార్ వ‌చ్చిన‌ప్పుడు ఖచ్చితంగా ఆ గెదె పాలు గ్లాస్ తాగుతానని తెలిపాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad