Home రాజకీయాలు జాతీయ వార్తలు మారటోరియం పొడిగింపు పై సుప్రీం సంచలన నిర్ణయం

మారటోరియం పొడిగింపు పై సుప్రీం సంచలన నిర్ణయం

921334 supreme court filr

మారటోరియం విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మారటోరియం పొడిగింపు అంశం పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.  ఈ పిటీషన్ పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రం వైఖరి ఏమిటో చెప్పవలసిందిగా కోరింది. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన తుషార్‌ మెహతా “అన్ని లోన్లకు రెండేళ్ల వరకు మారటోరియం పెంచే అవకాశం” ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. దీంతో వినియోగదారులకు భారీగా లాభం చేకూరనుంది. మార్చి 2020 నుంచి లోన్ల పై మారటోరియం ప్రారంభించిన కేంద్ర సెప్టెంబరు ఒకటితో ముగిస్తుందని ప్రకటించింది.

లాక్ డౌన్ కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు ఉపాధి కోల్పోయారు. చిన్న మధ్య తరగతి ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నేటితో మారటోరియం ముగియడంతో ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో విశాల్‌ తివారీ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా మారటోరియాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగించాలని పిటిషన్ లో కోరారు. పిటిషన్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు ఈ కేసును విచారించింది. కేంద్రం రెండేళ్ల వరకు మారటోరియం పెంచే యోచనలో ఉందని తుషార్‌ మెహతా తెలపడంతో కోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది.

నేటి నుండి  ఈఎంఐలపై ఎలాంటి అదనపు వడ్డీ విధించకూడదని పేర్కొంది. ఈఎంఐలపై కూడా అదనపు రుసుము విధించకూడదని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశించింది. ఈ కేసును రేపటికి వాయిదా వేసిన న్యాయస్థానం అంతిమ తీర్పు రేపు వెలువరించే అవకాశం ఉంది. తాజా కేంద్రం మరియు సుప్రీంకోర్టు ఆదేశాలతో కోట్ల మంది ప్రజలకు లాభం చేకూరనుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad