Home రాజకీయాలు జాతీయ వార్తలు వచ్చేస్తున్న కరోనా వ్యాక్సిన్: గుడ్ న్యూస్

వచ్చేస్తున్న కరోనా వ్యాక్సిన్: గుడ్ న్యూస్

coronavirus vaccine bottles

దేశాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ కు చరమగీతం పాడేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్ సంబంధించిన మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ భారతదేశంలో ఈ వారం నుండి ప్రారంభం కానున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మూడో దశలో 1600 మంది పై వ్యాక్సిన్ ప్రయోగిస్తామని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సమాచారం అందించింది. ఈ ప్రయోగాలు ఆగస్టు 22 నుండి ప్రారంభం కానున్నాయి.

భారత్ లోని మొత్తం 20 కేంద్రాలలో ఈ ప్రయోగాలు జరగనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ జాబితాలో పూణే, మహారాష్ట్ర , అహ్మదాబాద్ ఢిల్లీ. ఎయిమ్స్ సహా, ముంబైలోని సేథ్ జి.ఎస్. మెడికల్ కాలేజ్, కేఇఎం హాస్పిటల్, టీఎన్ మెడికల్ కాలేజ్, చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేంద్రాలు ఉన్నాయి. సీరం, ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో మరో 11-12 ఆసుపత్రులలో ప్రయోగాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ ప్రయోగాలలో పాల్గొనే వారి నుండి పూర్తి అనుమతి తీసుకున్న తర్వాతనే ట్రైల్స్  ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు.

ఇప్పటికే  రష్యా స్పుత్నిక్ వి అనేక కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసింది ఇది సెప్టెంబర్ మొదటి వారం నుండి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో భారత్ బయోటెక్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ కూడా రేసులో దూసుకుపోతుంది. ఇక తాజాగా తెలంగాణలో 1724 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 97,424 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 75,186 మంది డిస్చార్జ్  కాగా రాష్ట్రంలో 21,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad