Home రాజకీయాలు జాతీయ వార్తలు బెడిసికొట్టిన సల్మాన్ మర్డర్ ప్లాన్

బెడిసికొట్టిన సల్మాన్ మర్డర్ ప్లాన్

Salman Khan Murder Plan Bursted

సుశాంత్ సింగ్ మరణాన్ని మరువకముందే మరో హత్యకు కుట్ర బహిర్గతం కావడం బాలీవుడ్‌ను వణికిస్తోంది. హంతకుడు హత్య చేయాలనుకున్న వ్యక్తి సల్మాన్ ఖాన్ కావడంతో ఈ వార్త సంచలనం కలిగించింది. బాలీవుడ్‌కి ఇలాంటి కుట్రలు కొత్త కాదు. ఒకప్పుడు టి-సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ ఇలాగే హత్యకు గురయ్యారు. సాధారణంగా బాలీవుడ్‌లో ఇలాంటి హత్యలు, బెదిరింపుల వెనుక మాఫియా ఉంటుంది. ఇటీవల కాలంలో మాఫియా ఆగడాలు కనుమరుగయ్యాయి.

ఓ షార్ట్ షూటర్‌ని ఉత్తర ప్రదేశ్‌లోని ఫరిదాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ హత్యకు కుట్రకోణం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన ఓ షార్ప్ షూటర్‌ని ఫరిదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు హత్య చేయబోయే వ్యక్తుల జాబితాలో తదుపరి పేరు సల్మాన్ ఖానేనని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. సదరు షార్ప్ షూటర్ ముంబైలోని బాంద్రాలో సల్మాన్ ఖాన్ ఉంటున్న గెలాక్సీ అపార్టుమెంట్ వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్టు తెలిసింది.

సల్మాన్ ఖాన్ మర్డర్‌కి ప్లాన్ చేసిన షార్ప్ షూటర్ రాహుల్ తాను రెక్కీ పూర్తి చేసిన తర్వాత రెక్కిలో కనుగొన్న విషయాలను బిష్ణోయ్‌కి చేరవేశాడు. అయితే అనుకోకుండా కరోనావైరస్ వ్యాపించడం, ఆ తర్వాత పరిణామాలతో తన ప్లాన్‌ను అతను అమలు చేయలేకపోయాడని తెలుస్తోంది. సల్లూ భాయ్ పై హత్యాయత్నం 2018లో కూడా జరిగింది. ఇదే గ్యాంగ్‌కి చెందిన సంపత్ నెహ్రా అనే షూటర్ సల్మాన్‌ని హత్య చేసేందుకు కుట్రపన్నడమే కాకుండా రెక్కీ నిర్వహించాడు. అనుకోకుండా సంపత్ అరెస్ట్ అవడంతో అతడి ప్లాన్ వర్కౌట్ కాలేదు. కరోనా వ్యాప్తి అనంతరం లాక్‌డౌన్ సమయంలో పన్వెల్‌లోని ఫామ్‌హౌజ్‌లో 4 నెలల పాటు సెల్ఫ్ క్వారంటైన్ అయిన సల్మాన్ ఖాన్ ఇటీవలే మళ్లీ ముంబైకి తిరిగొచ్చాడు. ప్రస్తుతం బిగ్ బాస్ షో షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad