Home రాజకీయాలు జాతీయ వార్తలు రిలయన్స్ చేతికి బిగ్ బజార్..అంబానీ మాస్టర్ ప్లాన్!

రిలయన్స్ చేతికి బిగ్ బజార్..అంబానీ మాస్టర్ ప్లాన్!

Untitled design 3 43

భారత దేశ వాణిజ్య మార్కెట్లో రిలయన్స్ గ్రూప్స్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు పెట్రోలియం మరియు టెలికమ్యూనికేషన్ లో సత్తా చాటిన రిలయన్స్ ఇప్పుడు రిటైల్ మార్కెట్లోకి రానుంది అని తెలుస్తోంది. కిశోర్‌ బియానీ నాయకత్వంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ ను రిలయన్స్ కొనుగోలు చేయనుందని బిజినెస్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థ బిగ్‌ బజార్‌, సెంట్రల్‌, బ్రాండ్‌ ఫ్యాక్టరీ పేరుతో రిటైల్  కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే గత రెండేళ్లుగా భారీ నష్టాలను చవిచూస్తున్న ఈ సంస్థ దాదాపు 13 వేల కోట్ల ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.

2019 మార్చి నాటికి 12,788 కోట్లు ఆర్థిక భారం ఉండగా, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కిశోర్‌ బియానీ సంస్థలో కొంత వాటాను రిలయన్స్ కు విక్రయించాలని అనుకుంటున్నారట. ఈ ఒప్పందం విలువ దాదాపు 30 వేల కోట్లు ఉండనుంది. నేడు ఈ ఒప్పందంపై ఫ్యూచర్‌ బోర్డ్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఈ సంస్థను రిలయన్స్ రిటైల్ లో అంతర్భాగం చేయాలని ముఖేష్ అంబానీ అనుకుంటున్నారు. తద్వారా భారత్ రిటైల్ రంగంలో రిలయన్స్ నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది.

ఈ ఏడాది మేలో ఫ్యూచర్ గ్రూప్ తన వాటాను అమెజాన్ కు విక్రయించడానికి సిద్ధమైంది. ‌రిటైల్‌ ఈక్విటీలో అమెజాన్‌కు ఇప్పటికే 1.3 శాతం వాటా ఉంది. గత నెల అమెజాన్ తో చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదని అందుకే కిశోర్‌ బియానీ రిలయన్స్ తో చేతులు కలుపుతున్నట్టు పలు వార్తా పత్రికలు కథనాలు రాశాయి. ఈ ఒప్పందం పూర్తయితే రిటైల్ మార్కెట్లో రిలయన్స్ తన హవా కొనసాగించడం తథ్యం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad