Home రాజకీయాలు జాతీయ వార్తలు రికార్డులు బద్దలు కొట్టిన ‘రామాయణం’

రికార్డులు బద్దలు కొట్టిన ‘రామాయణం’

ramayan 1

దూరదర్శన్‌లో 30 ఏళ్ల కిందట ప్రసారమైన రామాయణానికి సీరియల్ టెలివిజన్ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. మార్చి 28 శనివారం నుండి రీ టెలికాస్ట్ అయినా ఈ సీరియల్ సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. తాజాగా ప్రసార భారతి సీఈఓ శశి శేఖర్  తెలిపిన వివరాలు ప్రకారం :ఈ సీరియల్‌కు 82 శాతం వ్యూయర్ షిప్ వచ్చింది. గత కొన్నేళ్లుగా ప్రసారవుతున్న సీరియల్స్ లో ఈ స్థాయి ఆదరణ రామాయణానికే మాత్రమే దక్కింది. తాజాగా బార్క్ ప్రకటించి నివేదిక ప్రకారం టీఆర్‌పీలో రామాయణం మొదటి స్థానంలో ఉన్నట్టు తెలిపింది. రామాయణ౦ సీరియల్ ను ఏప్రిల్‌ 16న 7.7 కోట్ల మంది వీక్షించారు. దీనితో డిడి నేషనల్ మొత్తం వీక్షకుల సంఖ్య 1.9 బిలియన్ గా  మారడంతో పాటు డిడి భారతి కూడా 51 మిలియన్ వీక్షకులను పొందింది. డిడి నేషనల్ వరుసగా రెండు వారాలు భారత్ లోని వాచ్ జిఇసిలో నంబర్ వన్ గా నిలిచింది.

గత వారం 1.5 బిలియన్ వీక్షకులతో సొంత వీక్షకుల రికార్డును అధిగమించింది.ప్రపంచంలో మరి ఏ ప్రభుత్వ రంగ టీవీ సంస్థ కూడా  ఈ స్థాయిలో ప్రేక్షకులను కలిగిలేదు. ఈ స్థాయి రేటింగ్ ప్రధాన కారణం  రామనంద్ సాగర్ దర్శకత్వం, రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ నటన కౌసల్యం ఈ సీరియల్ ను మరో స్థాయిలో నిలబెట్టాయి. జనవరి 25,1987 ప్రసారమైన ఈ సీరియల్ లోని విజువల్స్ ఇప్పటికీ ఒక  బెంచ్ మార్క్  లా ఉన్నాయి. ఒక భారతీయ ఇతిహాస గాధ నేటికీ అద్భుతాలు సృష్టిస్తుంది అంటే దానికి పూర్తి కారణం “రామాయణ కథలో ఉన్న” మహత్యం మాత్రమే. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad