Home రాజకీయాలు జాతీయ వార్తలు ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

twitter modi pm

మరోసారి హ్యాకర్లు రెచ్చిపోయారు. ఏకంగా భారతదేశ ప్రధాని మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌/యాప్‌కు చెందిన narendramodi_in ట్విటర్ అకౌంట్ ను హ్యాక్ చేశారు. ఈ రోజు ఉదయం తెల్లవారిజామున 3 గంటలకు మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. తరువాత వరుసగా క్రిప్టోకరెన్సీకి సంబంధించిన సందేశాలను ఈ అకౌంట్ లో దర్శనమిచ్చాయి. ఈ ఖాతాను తామె హ్యాక్ చేశామని జాన్ విక్ అనే గ్రూప్ ప్రకటించింది. అయితే తాము పేటీఎం మాల్‌ను హ్యాక్ చేయలేదని హ్యాకర్లు తెలిపారు. ఈ సందేహాలన్నీ మోదీ ట్విట్టర్ అకౌంట్ లోనే పోస్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ అకౌంట్ గతంలో కూడా పలుసార్లు హ్యాకింగ్ కు గురైంది. క్రిప్టోకరెన్సీని అందరికీ తెలియజేయడం కోసం హ్యాకర్లు ఇలా ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. “క్రిప్టోకరెన్సీ ద్వారా  డబ్బులు పంపించాలని” ఓ ప్రత్యేక  సందేశాన్ని పోస్ట్ చేస్తున్నారు. మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్ హ్యకింగ్‌ పై స్పందించిన ట్విట్టర్ యాజమాన్యం తక్షణం రక్షణ చర్యలను  తీసుకుంటున్నట్టు తెలిపింది.‘మేము పరిస్థితిని చురుకుగా పరిశీలిస్తున్నాం. ఈ సమయంలో, అదనపు ఖాతాలు ప్రభావితమవుతాయని భావించడంలేదు’ అని ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు. మునుపెన్నడూ లేనంతగా ట్విట్టర్ కు చెందిన పలు ప్రముఖుల అకౌంట్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి.

ఈ ఏడాది జులై‌ నెలలో భారీ స్థాయిలో అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమోక్రాట్స్ అభ్యర్థి జో బిడెన్, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్‌ సహా పలువురు ప్రముఖుల ఖాతాలను హ్యాకర్లు హ్యాక్ చేశారు. వీటితో పాటు పలు అంతర్జాతీయ సంస్థల ట్విట్టర్ అకౌంట్స్ కూడా  హ్యాకింగ్ కు గురయ్యాయి. గత నెలలో ఉబర్ , యాపిల్, హిప్-హాప్ మొగల్ కాన్యే వెస్ట్, న్యూయార్క్ నగర మాజీ మేయర్‌, బిలియనీర్ మైక్ బ్లూమ్‌బర్గ్ వంటి వారి ఖాతాలు కూడా హ్యాకర్ల బారినపడ్డాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad