Home రాజకీయాలు జాతీయ వార్తలు దక్షిణ మధ్య రైల్వే నుండి ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే నుండి ప్రత్యేక రైళ్లు

1 bccl

అన్‌లాక్‌ 4.0 తర్వాత ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైల్వే అధికారులు ఇప్పటికే దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే లైన్లలలో రైళ్లను నడపనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి 22 రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉండగా మరో 15 రైళ్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది. అయితే పరిస్థితుల దృష్ట్యా అన్ని రైళ్లలల్లో కేవలం రిజర్వేషన్ బోగీలు మాత్రమే ఉండనున్నాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటికే  సికింద్రాబాద్ నుండి ముంబై, విశాఖపట్నం, హౌరా, తిరుపతి, విజయవాడ వంటి ప్రముఖ నగరాలకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి.

కేంద్రం సడలింపులు ఇస్తూ ఉండటంతో ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో ఊహించిన స్థాయి కంటే రద్దీ భారీగా పెరిగింది. హైదరాబాదు నుండి ప్రతి రోజు దాదాపు 25,000 మంది ప్రయాణాలు చేస్తుండటం గమనార్హం. క్రితం వరకు సికింద్రాబాద్ నుండి న్యూ ఢిల్లీకి కేవలం ఒకే రైలు ఉండేది, ప్రయాణికులు రద్దీ దృష్ట్యా అధికారాలు ఈ రూట్లో మరో సర్వీసును ప్రారంభించనున్నారు.ఇక హైదరాబాద్ – తిరుపతి మధ్య కూడా ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు సికింద్రాబాద్ – తమిళనాడు మధ్య ఎటువంటి రైళ్లు లేకపోవడంతో దక్షిన మధ్య రైల్వే ఆ మార్గంలో ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉంది.

ఇక కాచిగూడ – బెంగుళూరు మధ్య కూడా ప్రత్యేక  రైళ్లు నడిచే అవకాశం ఉంది. కేంద్రం తాజా మార్గదర్శకాలుతో ఈ నెల 7 నుంచి మెట్రో రైలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎంఎంటీఎస్‌ సర్వీసులు పై ఎటువంటి నిర్ణయం తిసుకోలేదని తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad