
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఆయన ఏది చేసినా సంచలనంగా మారేందుకు తన ఇంటిని సైతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నిర్మాణాల్లో ఒకటిగా మలిచాడు. అంతటి ఆస్తిపాస్తులు ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినే ముఖేష్ అంబానీ ఎలాంటి కార్లు వాడుతాడా అనే సందేహం అందరిలో నెలకొని ఉంటుంది. వారి సందేహాలు, అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ముఖేష్ అంబానీ వాడే కార్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
నిజానికి ఆయన వాడే కార్లు చాలా లగ్జరీగా ఉండటమే కాకుండా అత్యంత భద్రతా వ్యవస్థను కలిగి ఉంటాయి. అందులో బీఎండబ్ల్యూ 7 సీరిస్ హై సెక్యూరిటీ, మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ కార్లు ఎక్కువగా వాడుతున్నారు. ఈ కార్లన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లు కావడం విశేషం. కాగా తాజాగా డబ్ల్యూ 222 మెర్సీడెస్ ఎస్ 600గార్డ్ లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందిన కారును ఆయన కొనుగోలు చేశారు. ఈ కారు ఖరీదు ఏకంగా రూ.10 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇంత ఖరీదైన కారుకు ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయో మనం ఇట్టే ఊహించుకోవచ్చు.
ఇది ప్రపంచంలోనే తొలి సివిల్ వెహికల్ కారు. ఇది చూడటానికి సాధారణ బెంజ్ కారులాగానే ఉంటుంది. దీంతో ఇది బుల్లెట్ ప్రూఫ్ కారు అనే విషయం ఎవిరికీ తెలియకుండా ఉంటుంది. కాగా ఈ కారు 6.0 లీటర్ వీ 12 బీ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుంది. ఏదేమైనా అంబానీ ఆస్తులే కాదు, ఆయన కార్లు కూడా అందరికీ షాకిస్తూనే ఉన్నాయి.