Home రాజకీయాలు జాతీయ వార్తలు సీఎం కొడుకుపై మండిపడ్డ క్వీన్

సీఎం కొడుకుపై మండిపడ్డ క్వీన్

kangana

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. ఈ ఘటనతో బాలీవుడ్‌లో నెపోటిజం అనే అంశానికి తెరలేవడంతో ప్రస్తుతం స్టార్స్ అందరూ ఈ అంశం తమకెక్కడ చుట్టుకుంటుందో అని వణికిపోతున్నారు. కాగా బాలీవుడ్‌లో ఏ అంశం అయినా తనదైన కామెంట్స్ చేసే బ్యూటీ కంగనా రనౌత్, సుశాంత్ సింగ్ మరణంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలోని కొందరిపై విమర్శనాస్త్రాలు విసిరింది.

బాలీవుడ్‌లో నెపోటిజం, మాఫియా, ఖాన్ కుటంబాలకు చెందిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు ఉన్నాయని.. వాటి కారణంగానే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. కాగా ఆత్మహత్య చేసుకునే ముందు సుశాంత్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని, ఆయనను కొంత మంది టార్గెట్ చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కంగనా అంటోంది. వారిలో బేబీ పెంగ్విన్ అంటూ పిలవబడే ఓ ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నాడని, ఆయన సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందురోజు ఓ పార్టీలో పాల్గొ్న్నాడని, దీంతో సుశాంత్ మృతి వెనక ఆయన హస్తం కూడా ఉందని కంగనా అంటోంది. ఆయన మహారాష్ట్రకు చెందిన ఓ సీఎం కొడుకు కావడం గమనార్హం అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో బడాబాబులుగా చెప్పుకునే వారు ఇలా సుశాంత్ ఆత్మహత్యకు కారణం అయ్యారంటూ కంగనా ఆరోపిస్తుండటంతో పలువురు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒకవేళ తాను ఇంటిలో ఉరివేసుకుని కనిపిస్తే, అది ఖచ్చితంగా ఆత్మహత్య మాత్రం కాదని ఆమె అంటోంది. ఏదేమైనా కంగనా చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు మహారాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad