Home రాజకీయాలు జాతీయ వార్తలు రెచ్చిపోతున్న చైనా?:దీటైన జవాబు ఇచ్చిన భారత్

రెచ్చిపోతున్న చైనా?:దీటైన జవాబు ఇచ్చిన భారత్

jpg 1

గల్వాన్ ఘర్షణల తరువాత సరిహద్దుల వెంబడి చైనా రెచ్చిపోతుంది. ముఖ్యంగా పాంగాంగ్ సరస్సు వద్ద భారత భూభాగాన్ని ఆక్రమించడానికి చైనా సైన్యం యత్నిస్తుంది. ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించగా ఈ చర్యను భారత సైన్యం తిప్పి కొట్టింది. దీంతో సరిహద్దుల వెంబడి అత్యాధునిక ఎయిర్‌ఫోర్స్ జె-20 యుద్ధ విమానాలను చైనా వాయుసేన మోహరించింది. కారకోరం కనుమ 250 కి.మీ. దూరంలో హోటన్ ఎయిర్‌బేస్ ను చైనా అభివృద్ధి పరుస్తుంది. ఇక్కడే జె-20 విమానాలతో పాటు ఇతర ఫైటర్ జెట్స్ ను ఎయిర్‌బేస్ వద్ద నిలిపింది. ఇటీవలే భారత రాఫెల్ యుద్ధ విమానాలు సరిహద్దుల వెంబడి మొహరించిన వెంటనే  జె-20  విమానాలను రంగంలోకి దింపింది.

ఐదో తరగతికి చెందిన ఈ విమానాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. చైనీస్ ఎయిర్ ఫోర్స్ దూకుడు పెంచడంతో భారత్ జిన్‌జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లోని మిలిటరీ బేస్‌లపై త్ నిఘా పెట్టింది.  చైనా దుశ్చర్యలను భారత సైన్యం ఎదుర్కొంటూనే ఉంది.  ఈ సమయంలో భారత్ చైనా కు గట్టి షాక్ ఇచ్చింది. భారత్ కు వ్యూహాత్మకంగా అతి ముఖ్యమైన చుషుల్ సెక్టార్‌ ను భారత్ తిరిగి స్వాధీనపరుచుకుంది. అక్కడే తిష్ట వేసి కూర్చున్నా చైనా బలగాలను అక్కడి నుండి తరిమివేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అంతర్జాతీయ వార్తా పత్రికలు కథనాలు ప్రచురితం చేశాయి.

చైనా గతంలో ఆక్రమించిన ఇతర పోస్టులను కూడా భారత్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. చుషుల్‌ ప్రాంతాన్ని స్వాధీనం పరుచుకోవడం కోసం ఇరు  బలగాలు దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు బాహాబాహీ తలపడ్డారని తెలుస్తోంది. దీనిపై ఓ సీనియర్ అధికారి ట్విట్టర్లో స్పందించారు. ఈ మినీ యుద్ధంలో భారత సైనికులు మరోసారి తమ ధైర్యసాహసాలను చూపించి వారిని అక్కడి నుండి తరిమికొట్టారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad