Home రాజకీయాలు జాతీయ వార్తలు కరోనా విలయతాండవం:సరికొత్త రికార్డ్

కరోనా విలయతాండవం:సరికొత్త రికార్డ్

download 4

భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో కేసు నమోదు అవుతుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఆదివారం ఏకంగా 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ చరిత్రలో ఒక్క రోజే 80వేల కేసులు నమోదయిన తొలి దేశంగా భారత్ రికార్డు సొంతం చేసుకుంది. భారత్ లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఆగస్టు 9న 63,851 కేసులు నమోదు కాగా నేడు ఆ రికార్డ్ ను భారత్ తిరిగి రాసింది. ఆగస్టులో వైరస్ వృద్ధి భారీ స్థాయిలో పెరగడం ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది.

గతవారంతో పోలిస్తే ఈ వారం వైరస్ వృద్ధి రేటు 13.1 శాతంగా ఉంది. ఆగస్టు 9-15 మధ్య 5.9 శాతం ఉండగా, ఆగస్టు చివరి నాటికి వైరస్ వ్యాప్తి రెండు రెట్లు అధికంగా ఉంది.  దేశంలో మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ వస్తుంది. గత నాలుగు రోజులుగా 1,000కిపైగా మరణాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం దేశంలో అత్యధిక కేసులు నమోదైనట్లు రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. కేవలం ఆదివారం ఒక్కరోజే 970 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 65 వేలకు చేరింది.

మహారాష్ట్రలోని మరణాల సంఖ్య అధికంగా ఉండటం అందర్నీ కలవరపరుస్తోంది. భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 36 లక్షలు దాటాయి. ఇందులో 27.67 లక్షల మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు దాదాపు 8 లక్షలు ఉన్నాయి. ఏపీలో మరో 10,603 మందికి వైరస్ సోకగా.. దేశంలో రెండో స్థానానికి చేరింది. ఇప్పటి వరకూ తమిళనాడు ఆ స్థానంలో ఉండగా.. ఆదివారం దానిని అధిగమించింది.  ఓవైపు కరోనా కేసులు పెరుగుతూ ఉండగా కేంద్రం అన్ లాక్ 4.0ను సెప్టెంబర్ మొదటి నుండి అమలుపరచనుంది. నూతన మార్గదర్శకాల ప్రకారం ధియేటర్ మినహాయించి అన్ని తెరచుకొన్నాయి. దీంతో సెప్టెంబర్ నెలలో కరోనా తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad