Home రాజకీయాలు జాతీయ వార్తలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న సీబీఐ: రియా క్యా హోగయా !

పట్టపగలే చుక్కలు చూపిస్తున్న సీబీఐ: రియా క్యా హోగయా !

rhea chakraborty 2 1

సుశాంత్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో నిందితురాలిగా ఉన్న రియా చక్రబొర్తి సీబీఐ విచారణకు హాజరైయింది. విచారణలో పోలీసులు ప్రశ్నల ధాటికి రియాకు పట్టపగలే చుక్కలు కనిపించాయని తెలుస్తోంది. శుక్రవారం పదకొండున్నర గంటలకు విచారణకు హాజరైన రియాను దాదాపు 11:30 గంటల ప్రశ్నించినట్టు సమాచారం. విచారణ మొదట్లో రియా చెప్పదలచుకున్న అంశాలను మొత్తం చెప్పవలసిందిపాటుగా అధికారులు అడిగారు. రియాకు – సుశాంత్ ఎలా పరిచయమయ్యాడు? తర్వాత వారి పరిచయం ప్రేమగా ఎలా మారింది? వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఎవరెవరు? అనే విషయాలపై సీబీఐ ప్రశ్నించింది. మొదట్లో రియా చెప్పిన వివరాలన్నిటినీ రికార్డ్ చేసుకున్న అధికారులు ఆ తర్వాత తమ సిద్ధం చేసుకున్న ప్రశ్నలను అడిగినట్లు సమాచారం.

ముఖ్యంగా సుశాంత్-రియా మధ్య ఆర్థిక లావాదేవీలు, మాదకద్రవ్యాలు వంటి అంశాలపై సీబీఐ ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. బుధవారం నాడు రియా సోదరుడు షోవిక్ ను సుదీర్ఘంగా ప్రశ్నించిన సీబీఐ అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా రియాను ప్రశ్నించారు. సుశాంత్ మరణానికి కొన్ని రోజుల ముందు రియా ఎందుకు ఫ్లాట్ ను విడిచిపెట్టి వెళ్లిందనే కోణంలో ప్రశ్నలు సంధించినట్టు పలు వార్తా పత్రికలు కథనాలు రాశాయి. విచారణకు హాజరు కావడానికి ముందు రియా ఓ జాతీయ వార్తా చానల్ కు  ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలో సుశాంత్ పై అనేక ఆరోపణలు చేసింది. అతడు డ్రగ్స్ తీసుకుంటాడని, మానసిక సమస్యతో బాధపడుతున్నాడు అని చెప్పింది. అయితే తను మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి మాదక ద్రవ్యాలను తీసుకోలేదని తెలిపింది.

సీబీఐ విచారణలో సుశాంత్ వ్యక్తిగత సహాయకుడు సబీర్ అహ్మద్ మాత్రం ఈ విషయాల్ని ఖండించాడు. సుశాంత్ తో 24 గంటల పాటు తను ఉండేవాడినని, తను పనిచేసినన్ని రోజుల్లో ఎప్పుడూ ఎంఎల్, ఎండీ లాంటి డ్రగ్స్ పేర్లు వినలేదని తెలిపాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad