Home రాజకీయాలు జాతీయ వార్తలు ఖాతాదారులకు గుడ్ న్యూస్:యూపీఐ చార్జీల రిఫండ్‌

ఖాతాదారులకు గుడ్ న్యూస్:యూపీఐ చార్జీల రిఫండ్‌

unnamed file 3

యూపీఐ చెల్లింపు సమయంలో ఛార్జీలు విధించిన కంపెనీలపై ఆదాయపన్ను శాఖ కొరడా ఝుళిపించింది. ఈ ఏడాది జనవరి 1 తారీకు నుండి యూపీఐ ఛార్జీలను విధించిన కంపెనీలు ఆ మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి చెల్లించాలని సీబీడీటీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు బ్యాంకులు వసూలు చేసిన యూపీఐ చార్జీలు మరికొన్ని రోజుల్లో కస్టమర్లకు అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. యూపీఐ చెల్లింపులు సమయంలో బ్యాంకులు అధికస్థాయిలో చార్జీలను విధించాయని ఫిర్యాదులు రావడంతో సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

యూపీఐ చెల్లింపుల్లో ఎటువంటి ఛార్జీలను వసూలు చేయవద్దని గత ఏడాది డిసెంబర్ లోనే సీబీడీటీ సూచించింది. అయినప్పటికీ బ్యాంకులు డిజిటల్ ట్రాన్సక్షన్ లో చార్జీలు అంటూ వినియోగదారుల నుండి రెండు నుంచి నాలుగు రూపాయల వరకు వసూలు చేశాయి. దీంతో ఆగ్రహించిన సీబీడీటీ చర్యలకు దిగింది. ఈ అంశంపై సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంకుర్ గోయల్ మాట్లాడుతూ “బ్యాంకులు  పీఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 10ఏ రూల్‌ను అతిక్రమించాయి. ఐటీ చట్టంలోని 269ఎస్‌యూ‌ను దిక్కరించిటంతో వారిపై చర్యలు తీసుకుంటాం. ఐటీ యాక్ట్ 271 డీఎస్, పీఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ 26 ప్రకారం బ్యాంకులు తగిన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుంది’ అని అన్నారు.

యూపీఐ ద్వారా జరిగే చెల్లింపుల్లో ప్రస్తుతం లేదా భవిష్యత్ ఎటువంటి చార్జీలు ఉండవు.  డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టంలో కేంద్రం ప్రత్యేక నిబంధనను చేర్చిన విషయం తెలిసిందే. తాజా సీబీడీటీ ఆదేశాలతో వినియోగదారులకు భారీగా లాభం చేకూరనుంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad