Home రాజకీయాలు జాతీయ వార్తలు మారిటోరియంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

మారిటోరియంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

SupremeCourtofIndia 1

కరోనా కట్టడి సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మారటోరియం విధించింది. ఈ మారిటోరియం ఈనెల 31తో ముగియనుంది. అయితే ఇప్పటి వరకు ఆర్‌బీఐ మరియు బ్యాంకుల నుండి మారటోరియం అంశానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం వారం రోజుల్లో మారిటోరియం పై కేంద్రం వైఖరిని తెలియజేయాలని కోరింది. ఈ సమయంలో న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది.

వడ్డీ మీద వడ్డీ విధిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ప్రతి సారి ఆర్‌బీఐ పేరుతో దాగుడుమూతలాడటం సరికాదని హితవు పలికింది. ప్రభుత్వం అందించిన ఆర్థిక ఉద్దీపనలు ప్రజలకు ఉపయోగపడ్డాయా లేక కార్పొరేట్లకు ఉపయోగపడ్డాయా అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపార ఉద్దేశాలను పక్కనపెట్టి ప్రజల గురించి ఆలోచించాలని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వడ్డీ మాఫీ, వడ్డీపై వడ్డీ మాఫీ అంశంపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని పేర్కొంది. వడ్డీ మాఫీ చేయాలని కోరుతూ  దాఖలైన పిటిషన్‌పై స్పందన దాఖలు చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.

ఈ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుంటూ…గడువులోగా నివేదిక అందజేస్తామని అంతలోగా సుప్రీంకోర్టు ఎలాంటి  నిర్ణయానికి రాకూడదు అని కోరారు. అనంతరం విచారణను సుప్రీం కోర్టు సెప్టెంబర్ 1 కి వాయిదా వేసింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad