Home రాజకీయాలు జాతీయ వార్తలు హైదరాబాదులో భారీ డ్రగ్స్ పట్టివేత

హైదరాబాదులో భారీ డ్రగ్స్ పట్టివేత

AAAABbqqa0SLtiT2NPCYsXsUGbBwZL7u6txf jXL N34iLt1uYD5DYtxLCkU5wc8eJ9iCEUEns23cMhRhvQLWpxBBQITKtZE

హైదరాబాద్ లో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబట్టడం కలకలం రేపుతోంది. హైదరాబాదు నగర శివారులోని ఫార్మా కంపెనీ ఆవరణలో భారీగా మాదక ద్రవ్యాలు లభించినట్టు రెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్అధికారులు తెలిపారు. కేంద్రం లాక్ డౌన్ విధించడంతో నగరంలో డ్రగ్స్ వాడకం పెరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో డీఆర్ఐ మరియు హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా సోదాలు  నిర్వహించారు. ఈ సోదాల్లో 50 కిలోల నార్కోటిక్ డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. నిందితులు డ్రగ్స్ పోలీసులకు దొరక కూడదని భూమిలో పాతిపెట్టడం పోలీసులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. లభించిన డ్రగ్స్ విలువ దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఉండనుందని తెలుస్తోంది.

ఈ డ్రస్ లో అత్యంత ప్రమాదకరమైన ఎపిడ్రిన్ 45 కిలోలు, మెఫెడ్రోన్ 7.5 కిలోలు ఉన్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకడం ఇదే మొదటిసారి. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను  ఎందుకు తీసుకువచ్చారు ?  వాటిని ఇప్పటివరకు ఎవరికైనా సరఫరా చేశారా ? అనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ ముఠా పోలీసులకు చిక్కి కూడదని వీటిని కార్గో బస్సుల ద్వారా రవాణా చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

వారం రోజుల కిందట డీఆర్ఐ అధికారులు డీఆర్ఐ దాదాపు రూ.50 కోట్లు విలువ చేసే 250 కేజీల డ్రగ్స్ ను  రూ.45 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారి నుండి లభించిన సమాచారం ఆధారంగానే తాజాగా పోలీసులు ఈ డ్రగ్స్ ను గుర్తించినట్టు సమాచారం. ప్రశాంత హైదరాబాదులో భారీ స్థాయిలో డ్రగ్స్ దొరకడం ఇప్పుడు పోలీసు శాఖను కలవరపెడుతోంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad