Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు ఎయిర్ టెల్ వినియోగదారులకు షాక్: 1జీబీ డేటా వంద రూపాయలు?

ఎయిర్ టెల్ వినియోగదారులకు షాక్: 1జీబీ డేటా వంద రూపాయలు?

media handler 1

మొబైల్ ఫోన్ యూజర్లకు ఎయిర్టెల్ గట్టి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఓ సమావేశంలో మాట్లాడుతూ భవిష్యత్తులో టెలికాం డేటా సేవల ధరలు భారీగా పెరగనున్నాయి తెలిపారు. తక్కువ ధరకు డేటా సేవలను అందించడం సాధ్యం కాదని వచ్చే ఆరు నెలల్లో దాదాపు 60 శాతం డేటా ధరలు పెరగనున్నాయని షాకింగ్ న్యూస్ చెప్పారు. తక్కువ ధరకు సేవలను అందించడం ద్వారా టెలికాం పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉందని మిట్టల్ అందోళన వ్యక్తం.

కేవలం 160 రూపాయలకే నెలకు 16 జీబీ డేటా ఇవ్వడం బాధాకరం అన్నారు. అమెరికా యూరప్ దేశాల్లో ఒక జీబీ డేటాకు 50 నుండి 60 డాలర్లు చెల్లిస్తూ ఉంటే మన దేశంలో కనీసం ఒక్క డాలర్ కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నెలకి కేవలం 1.5 జీబీ డేటా మాత్రమే లభించనుంది దీనికి ప్రజలందరూ అలవాటు పడాలని వారన్నారు. అలా లేని పక్షంలో అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని అన్నారు. వచ్చే ఆరు ఆరు నెలల కాలంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ధరలు భారీగా పెరగనున్నాయి అని వారు స్పష్టం చేశారు.

దీనిబట్టి చూస్తున్నట్లయితే వచ్చే ఆరు నెలల్లో ఎయిర్టెల్ ఏఆర్‌పీయూ ధరలు దాదాపు ఐదు రెట్లు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ప్రస్తుతం నెలకి రెండు వందల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు అయితే రాబోతున్న కాలంలో దానికి ఐదు రెట్లు చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో ఒక జీబీ డాటా కి గాను 10 రూపాయలు చెల్లిస్తున్నారు. భవిష్యత్తులో ఆ ధర రూ.100 ఎగబాకే అవకాశం ఉంది.  ప్రస్తుతం సునీల్ మిట్టల్ వ్యాఖ్యలు టెలికం సర్కిల్లో తీవ్ర దుమారాన్ని తెరతీశాయి. అసలే నష్టాల్లో ఉన్న ఎయిర్టెల్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని టెలికం నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad