Home రాజకీయాలు జాతీయ వార్తలు ముంబై ఎయిర్‌పోర్టు కూడా అంతేనా?

ముంబై ఎయిర్‌పోర్టు కూడా అంతేనా?

Adani Group To Buy Mumbai A

ముంబై ఎయిర్‌పోర్టు నిర్వాహణను గతకొంత కాలంగా జీవీకే కంపెనీ చూస్తో్న్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కంపెనీ కొంప ముంచేందుకు అదానీ గ్రూప్ రెడీ అవుతోంది. ఇప్పటికే దేశంలోని పలు విమానాశ్రాయాల నిర్వహణా బాధ్యతలను చేజిక్కించుకుంటూ వస్తోన్న అదానీ గ్రూప్స్ సంస్థ, ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్టుపై కన్నేసింది. ఇందులో భాగంగా జీవీకే సంస్థ నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం చేస్తుండగానే దెబ్బ కొట్టేందుకు అదానీ గ్రూప్స్ ప్లాన్ చేస్తోంది.

ఇటీవల నష్టాలను చవిచూస్తున్న జీవీకే ఇప్పుడు ముంబై ఎయిర్ పోర్టు నిర్వహణ నుండి బయటకు వచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే జీవీకే నుండి ఆ బాధ్యతలను అందుకునేందుకు అదానీ గ్రూప్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా జీవీకే గ్రూపుకు చెందిన 50.5 శాతం భాగాన్ని అదానీ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఎయిర్ పోర్ట్స్ కంపెనీ సౌతాఫ్రికా, బిడ్ వెస్ట్ గ్రూప్ నుంచి మరో 23.5 శాతం వాటాలను కొనుగోలు చేయనుంది.

ఈ విధంగా ముంబై ఎయిర్‌పోర్టు కూడా అతి త్వరలో అదానీ గ్రూప్స్ చేతుల్లోకి వెళ్లనుంది. విమానాశ్రాయాల నిర్వహణలో వేగంగా దూసుకుపోతున్న అదానీ గ్రూప్స్ సంస్థ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఈ విధంగా పక్కా ప్రణాళికతో దూసుకుపోతుండటంతో బిజినెస్ వర్గాలు ఆ సంస్థ పనితీరుపై ఫిదా అవుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad