Home రాజకీయాలు జాతీయ వార్తలు ప్రజలకు మోదీ గుడ్ న్యూస్ : వ్యాక్సిన్ వచ్చేస్తుంది

ప్రజలకు మోదీ గుడ్ న్యూస్ : వ్యాక్సిన్ వచ్చేస్తుంది

download 49 1597476073

భారతదేశ 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా ప్రజలనుద్దేశించి కీలక ప్రకటన చేశారు. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ను అంతం చేసే మూడు  వ్యాక్సిన్ లు ప్రయోగ దశలో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఆమోదం మరియు ప్రయోగ పరీక్షల ఫలితాల ఆధారంగా వాటిని విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ మరియు తయారికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నమని తెలిపారు.

వ్యాక్సిన్ విడుదలైన తర్వాత అత్యంత వేగంగా ప్రజలకు చేరే విధంగా పంపిణీ కొరకు ప్రత్యేకమైన  రోడ్‌మ్యాప్ సిద్ధం చేసి ఉంచమని ప్రధాని ప్రకటించారు. అత్యంత విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్నా కరోనా  యోధులకు శిరస్సు వంచి నమస్కారం తెలుపుతున్నాని అన్నారు. దేశ సేవకు అవిశ్రాంతంగా పని చేస్తున్న వైద్యులు, నర్సులు, పారామిలటరీ వైద్య సిబ్బంది మరియు ఇతర కరోనా యోధులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

పౌరుల ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో మార్చడంతో పాటు ఆధార్‌ కార్డు తరహాలో హెల్త్‌ కార్డు జారీ చేయనున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ పధకానికి 300 కోట్ల రూపాయలను కేటాయించినట్టు ప్రధాని తెలిపారు. ఈ పథకం దశలవారీగా అమలు కానుందని తెలిపారు.  ప్రస్తుతం భారత్ బయోటెక్ తయారు చేస్తున్నా కోవ్యాగ్జిన్ రేసులో ముందు ఉంది. దీనితో మరో రెండు వ్యాక్సిన్ లు స్టేజ్ – 2 లో ఉన్నాయి

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad