ఆంధ్రప్రదేశ్ మంత్రి “నారా లోకేశ్” వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. ఎందుకంటే ఇప్పటివరకు అంత నమ్మకంగా తన తండ్రి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కూడా ప్రజల ముందు మాట్లాడలేదు. అందుకే లోకేష్ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో మేమే విజయం సాధిస్తాం అని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాలకు సమయానికి పెన్షన్ ఇస్తున్నాం. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో రైతన్నల రుణమాఫీ చేశాం. అదే 175 నియోజకవర్గాల్లో డ్వాక్రా మహిళలకు డబ్బులు కూడా ఇచ్చాం. ఇవేకాక అన్ని నియోజకవర్గాలకు తాగునీరు, సాగునీరు కూడా అందజేస్తున్నాం. ఇన్ని చేసిన మాకు తప్ప ఓటు ఎవరికి వేస్తారు..? కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లోనూ TDPనే అధికారంలోకి రాబోతోంది అంటూ చెప్పాడు లోకేష్.
విజయవాడలోని “భవనీపురం వాటర్ వర్క్స్” దగ్గర శనివారం నిర్వహించిన “జలసిరికి హారతి” కార్యక్రమంలో పాల్గొన్నా లోకేష్.. నాడు పట్టిసీమ ప్రాజెక్టు దండగ అని చెప్పిన ఏకైన వ్యక్తి జగనే.. అలాగే AP, తెలంగాణల మధ్య చిచ్చు పెట్టేందుకు కూడా మన ప్రతిపక్ష నేత చాలానే యత్నిస్తున్నాడు.. కాబట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు చెందిన పులివెందుల నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీనే విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాడు మంత్రి లోకేష్.