తమకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేదంటూ నిన్న తిరుపతిలో నటుడు, వ్యాపారవేత్త “మోహన్ బాబు” తన కుమారులతో కలసి చేపట్టిన నిరసన కార్యక్రమం APలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. TDP ప్రభుత్వం చేసిన తప్పును బయటపెట్టాలని మోహన్ బాబు చూస్తే.. నువ్వేమైనా తక్కువా ఇదిగో నీ తప్పులు.. ఇంత మందిని మోసం చేశావు, పెద పిల్లాడి సర్టిపికెట్స్ తిరిగి ఇవ్వడానికి 2 లక్షలు తీసుకున్నావ్.
ఇదేకాక నిన్నటి నుండి ప్రభుత్వానికి వందల ఫోన్ కాల్ వస్తున్నాయ్. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరూ “మోహన్ బాబు” మమ్మల్ని నిలువునా ముంచాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కాబట్టి నీపై ఎంక్వయిరీ వేయడానికి ఆదేశాలు జారీచేసాము అంటూ AP ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు “కుటుంబరావు” మరోసారి ప్రెస్ మీట్ పెట్టి మరి మోహన్ బాబుకు వార్నింగ్ ఇచ్చాడు.
ఇదిలాఉంటే మోహన్ బాబు మాత్రం నేను, నా విధ్య సంస్థలు ఎలాంటి తప్పులు చేయలేవు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే జాగ్రత్తా.. అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. మరోపక్క చంద్రబాబు ఇప్పుడు కేలవం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే ఇప్పుడు అతడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేడు.. అది అతడికి తెలుసు, అందరికీ తెలుసు అంటూ నిన్న మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే.