Home రాజకీయాలు ప్రధాని మోడీ ఓ దొంగ : రాహుల్ గాంధీ

ప్రధాని మోడీ ఓ దొంగ : రాహుల్ గాంధీ

రాఫెల్ కుంభకోణంలో ప్రధాని మోడీ పాత్ర ఉందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో సారి ఆరోపించారు. ఈ రోజు ఢిల్లీలో మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… రాఫెల్ కుంభకోణంలో ప్రాన్స్ తో ప్రధాని మంత్రి కార్యాలయం నేరుగా చర్చలు జరిపిందన్నారు. ఆ మేరకు 2017 నాటి రక్షణశాఖ నోటీసులను రాహుల్ గాంధీ మీడియా ముందుంచారు. రాఫెల్ కుంభకోణంలో అనీల్ అంబానీకి మోడీ 30వేల కోట్ల రూపాయలను దోచిపెట్టారని ఆరోపించారు.

ప్రధాని మోడీ దేశానికి కాపలా దారుడు కాదని, దొంగతో సమానమని విమర్శించారు. రాఫెల్ కుంభకోణం విషయంలో ఉన్నత స్థాయి కమిటీ చర్చలు జరుపుతున్నప్పుడు పీఎంవో జోక్యం ఏంటని, రక్షణ శాఖ వ్యతిరేకించినా ఎందుకు ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. అనీల్ అంబానీ కోసమే, ప్రాన్స్ తో పీఎంవో చర్చలు జరిపిందన్నారు.

రాఫెల్ డీల్ దేశం కోసం కాదు.. అనీల్ అంబానీ కోసమే ప్రధాని మోడీ ప్రాన్స్ తో ఒప్పందం చేసుకున్నట్టు ఉందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టును సైతం తప్పుదోవ పట్టించిందన్నారు. మోడీ, నిర్మలా సీతారామన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad