Home రాజకీయాలు జాతీయ వార్తలు వైద్యుడు అవతారం ఎత్తిన ఎమ్మెల్యే : గర్భిణికి సీజేరియన్‌

వైద్యుడు అవతారం ఎత్తిన ఎమ్మెల్యే : గర్భిణికి సీజేరియన్‌

PicsArt 08 12 02.14.54

ప్రజాప్రతి నిధులు అంటే కేవలం పరిపాలన కొనసాగించే వారు మాత్రమే కాదు. అవసరమయినప్పుడు తన ప్రతిభను భయటకు తీసి ఎదట వారికీ సాయం చేసేవారు కూడా. మనదేశంలోని ప్రజాప్రతి నిధులలో అతి తక్కువ మంది మాత్రమే ఉన్నత విద్యను అభ్యసించారు అటువంటి వ్యక్తుల్లో డాక్టర్ జెడ్ఆర్ థియామ్ సంగ ఒకరు. వీరు ప్రస్తుతం మిజోరాంకు చెందిన శాసనసభ్యుడు వ్యవహరిస్తున్నారు. అయితే థియామ్ స్వతహాగా వైద్యుడు. అత్యవసర సమయంలో వైద్యుడిగా మారీ రోగులకు సేవలు అందిస్తుంటాడు. తాజాగా ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆయన పురుడు పోశారు. కొద్ది రోజులు క్రితం మిజోరాంలో సంభవించిన భూంకపాలు మరియు కరోనా తీవ్రతవంటి అంశాలు పై ఏరియల్ సర్వే నిర్వహించడానికి అధికారులతో పాటు తన నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలలుకు వెళ్లారు.

ఈ సమయంలో ఓ మహిళ ప్రసవ వేదనతో భాదపడుతుండగా ఆయన అ గర్భిణికి పురుడు పోశారు. సమయానికి ఎమ్మెల్యే స్పందించడంతో.. బాధిత మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎమ్మెల్యే చొరవతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. థియామ్ ప్రజాప్రతినిదిగా మారడానికి ముందు గైనకాలజీ డాక్టర్‌ పనిచేసారు. దీనితో వెంటనే గర్భిణిని చాంఫై ఆస్పత్రికి తరలించి స్వయంగా ఆయనే ఆమెకు పురుడు పోశారు. చాంఫై ఆస్పత్రి డాక్టర్‌ అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉండటంతో గర్భిణికి ఎమ్మెల్యే సీజేరియన్‌ చేశారని ప్రభుత్వం తెలిపింది. ఇటువంటి ప్రజాప్రతి నిధులు అనేక మందికి ఆదర్శం అని అనేక మంది నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికలలో మిజో నేషనల్ ఫ్రంట్ నుండి పోటి చేసి థియామ్ విజయం సాధించారు.ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్ కూడా ఉన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad