Home రాజకీయాలు ఏపి వార్తలు ఏం మాట్లాడుతున్నావ్...మాటలు సరిగ్గా రాని:మంత్రి అనిల్ ఫైర్

ఏం మాట్లాడుతున్నావ్…మాటలు సరిగ్గా రాని:మంత్రి అనిల్ ఫైర్

maxresdefault 4

ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అధికారుల పై ఫైర్ అయ్యారు. కరోనా విషయంలో నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు తీస్తున్నారని అధికారుల పై విరుచుకుపడ్డారు. సోమవారం నెల్లూరులోని నూతన జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో కరోనాకు సంబంధించి సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో జిల్లా వైద్య అధికారులతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో జీజీహెచ్ సూపర్డెంట్ సుధాకర్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో పాటు తన కాల్ ను కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మీరు చేస్తున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వం నిందలు పడవలసి వస్తుందని  ఒకింత ఫైరయ్యారు. ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అత్యవసర విభాగాన్ని బాగు చేయకపోవడం ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపరచకోవడంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆసుపత్రికి ఎటువంటి సహాయం కావాలన్నా ప్రభుత్వ అందించడానికి సిద్ధంగా ఉందని చెబుతున్నప్పటికీ మీరు పట్టించుకోవడం లేదని సుధాకర్ రెడ్డి పై ఆగ్రహంతో ఊగిపోయారు. కరోనాతో వచ్చిన ఏ ఒక్క రోగికి కూడా బెడ్ లేదని చెప్పకూడదని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో పాటు పరీక్షల్లో కూడా నిర్లక్ష్యం చేయించడం సరైన విధానం కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. మెడికల్ విద్యార్థులను అత్యవసర సేవలకు వినియోగించాలని మంత్రి కోరారు.

వైద్య సేవల విషయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న వారిపై ఎంతటి కఠిన చర్యలు తీసుకోవడాని అయినా సిద్ధంగా ఉన్నామని తెగేసి చెప్పారు. ఇక నుండి తానే స్వయంగా నెల్లూరు జిల్లాలోని పరిస్థితులను పర్యవేక్షిస్తామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రోగులు మరణించ కూడదని..వారికి అసౌకర్యం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని మంత్రి ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad