Home రాజకీయాలు చివరి నిమిషంలో మార్పులు : మంగళగిరి స్థానం నుండి జనసేన అభ్యర్థి పోటీ

చివరి నిమిషంలో మార్పులు : మంగళగిరి స్థానం నుండి జనసేన అభ్యర్థి పోటీ

జనసేన అధినేత “పవన్ కళ్యాణ్” మంగళగిరి నియోజకవర్గం అభ్యర్థి స్థానాన్ని చివరి నిమిషంలో మార్చడంతో మంగళగిరి స్థానం రసవత్తరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు “నారా లోకేశ్‌” ఈ నియోజకవర్గం నుండే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.. లోకేశ్ పోటీ చేస్తుండడంతో మంగళగిరి హాట్ షీటుగా మారింది. దాంతో ఈ నియోజకవర్గం నుండి జనసేన కూడా రంగంలోకి దిగింది. ఇదిలాఉంటే నామినేషన్ల దాఖలుకు చివరి రోజున ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్.

జనసేన వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తుల్లో భాగంగా ఏడు అసెంబ్లీతో పాటు, రెండు పార్లమెంట్‌ స్థానాలను CPIకి కేటాయించింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చడంపై CPI నేతలు అసంతృప్తికి గురయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపి సర్దుబాటు చేసుకున్నారు. ఇక అదే పొత్తుల్లో భాగంగా ముందుగా మంగళగిరి స్థానంలో CPI పార్టీ అభ్యర్థిని ప్రకటించింది జనసేన.

కానీ చివరి నిమిషంలో ఆ స్థానంలో కూడా మార్పులు చేసి జనసేన అభ్యర్థి “చల్లపల్లి శ్రీనివాస్‌”కు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. CPI తరఫున “ముప్పాళ్ల నాగేశ్వరరావు” నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతుండగా.. మంగళగిరి అభ్యర్థిగా “చల్లపల్లి శ్రీనివాస్‌” ను జనసేన ప్రకటించింది. బీ-ఫారాన్ని ఆదివారం అర్ధరాత్రి అందజేసింది. దీంతో శ్రీనివాస్ ఈరోజు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మార్పుకు గల కారణాలు ఏంటి ? అని ఆరా తీయగా.. స్థానికంగా ఉన్న జనసేన నేతలను సంతృప్తి పరిచేందుకు, అలాగే స్థానికంగా ఉన్న పార్టీ కేడర్‌ ను కాపాడుకునేందుకే జనసేన అధ్యక్షుడు పవన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ నిర్ణయం పట్ల CPI పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad