ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త మంచు మోహన్ బాబు ఈమద్య YSRCP పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ క్షణం నుండి AP ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. నీ బాగోతం మొత్తం నా చేతిలో ఉంది.. నేను నోరువిప్పితే నీ రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడుతుంది అంటూ బెదిరిస్తున్నాడు మోహన్ బాబు. ఆయన ఎన్ని మాట్లాడినా చంద్రబాబు మాత్రం సైలెంట్ గానే ఉంటున్నాడు. పొరపాటున కూడా ఆయన నోట మోహన్ బాబు పేరు వినిపించడం లేదు.
అలాంటి మోహన్ బాబు గారికి గుర్తుతెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలుస్తుంది. అదికూడా ఆయన YCPలో చేరినప్పటినుండే వస్తున్నాయట. దాంతో పోలీసులను ఆశ్రయించారు మోహన్ బాబు. ఈ మేరకు హైదరాబాద్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. గత నెల 26న తన ఫోన్ నెంబర్ కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఈ బెదిరింపు కాల్స్ విదేశాల నుంచి వచ్చినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం.