Home రాజకీయాలు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తింగరి నిర్ణయం.. జీన్స్ వద్దు

మధ్యప్రదేశ్ ప్రభుత్వం తింగరి నిర్ణయం.. జీన్స్ వద్దు

Madhya Pradesh banned wearing jeans

మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ నిర్ణయంపై నెటిజన్స్ మరియు ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర స్వరంతో విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటో చెప్పలేదు కదూ..గత నెల 20న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశానికి మాండ్‌సౌర్‌ జిల్లాలోని ఓ అధికారి టీ షర్టు ధరించి వచ్చారు. నా ముందు టీ షర్ట్ ధరిస్తావు అని సీఎం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గౌరవమైన, సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు టీ షర్టులు, జీన్స్‌లు ధరించవద్దని ఆదేశించింది. విధులకు హాజరయ్యే సమయంలో ఉద్యోగులు టీ షర్టు ధరించడం హుందాతనం కాదని ఉత్తర్వులలో తెలిపింది. గ్వాలియర్‌ డివిజన్‌లోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తమ విధులకు హాజరయ్యేటప్పుడు జీన్స్‌, టీ షర్టులు ధరించడంపై నిషేధం విధించింది. దీనికి సంబంధించిన డివిజనల్‌ కమిషనర్‌ ఎంబీ ఓజా సర్క్యూలర్‌ జారీ చేశారు. మధ్యప్రదేశ్ పాలకులు ప్రభుత్వ ఉద్యోగుల దుస్తుల పై పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం పై పెట్టి ఉంటే కరోనా ఈ స్థాయికి వచ్చేది కాదని వ్యగ్యంగా సెటైర్స్ వేస్తున్నారు. అయినప్పటికీ మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంది

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad