Home రాజకీయాలు జాతీయ వార్తలు ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్.. ఎక్కడో తెలుసా?

ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్.. ఎక్కడో తెలుసా?

Lockdown Till August 31 In Manipur

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రజలతో పాటు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎన్ని నివారణా చర్యలు తీసుకున్నా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఈ వైరస్ బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు మార్చి నెల నుండి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల దశల వారీగా లాక్‌డౌన్‌ను సడలిస్తూ వస్తోంది. కానీ కరోనా మహమ్మారి తన విజృంభనను ఏమాత్రం ఆపడం లేదు.

దీంతో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు స్వయంగా లాక్‌డౌన్‌ను విధించుకుంటున్నాయి. తాజాగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఆగస్టు 31 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు ప్రస్తుతం కష్టపడ్డా వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ ప్రకటించారు. కాగా అన్ని శాఖల మంత్రులతో చర్చలు జరిపాకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.

ఇక ఈ లాక్‌డౌన్ సమయంలో కేవలం అత్యవసర సేవలు, నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాగా ఈ లాక్‌డౌన్‌తో కరోనాను కట్టడి చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు దేశవ్యప్తంగా పెరుగుతుండటంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఇక సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad