Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు రష్యా వ్యాక్సిన్ సూపర్ సక్సెస్:లాన్సెట్‌

రష్యా వ్యాక్సిన్ సూపర్ సక్సెస్:లాన్సెట్‌

media handler

ప్రపంచంలోని మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ “స్పుత్నిక్‌ వీ” మెరుగైన ఫలితాలను రాబట్టింది అని ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్‌ ప్రకటించింది. వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొన్న వాలంటీర్ల అందరిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని తెలిపింది. మొదట్లో రష్యా తయారుచేసిన టీకా పై ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. మూడో దశ క్లినికల్ ముగియకుండానే వ్యాక్సిన్ ను ప్రజలకు పంపిణీ చేయడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అమెరికా కూడా వ్యతిరేకించింది. దీంతో రష్యా ప్రభుత్వం రెండో దశ ప్రయోగాన్ని జూన్‌-జులై నెలల్లో నిర్వహించింది. ఈ దశలో 76 మంది వాలంటీర్ల పై ప్రయోగించగా వారిలో కరోనా వైరస్ ని ఎదుర్కొనే యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని లాన్సెట్‌ పేర్కొంది.

ప్రయోగంలో పాల్గొన్న ఏ ఒక్కరికి తీవ్ర సైడ్‌ఎఫెక్ట్స్‌ కనిపించలేదని లాన్సెట్‌ తెలిపింది. అయితే వ్యాక్సిన్ రక్షణ, అభివృద్ధి, సమర్థత వంటి అంశాలపై దీర్ఘకాలం ప్రయోగాలు చేయవలసి ఉంటుందని పేర్కొంది. లాన్సెట్‌ వాదనతో ఏకీభవించిన రష్యా ప్రభుత్వం తమ టీకా సమర్థవంతమైన అని తెలిపింది. అంతర్జాతీయ పత్రిక లాన్సెట్‌లో తొలిసారిగా రష్యన్‌ వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాలు ప్రచురించింది. 40,000 మందిపై గతవారం పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో తమ వ్యాక్సిన్‌పై అనుమానాలు పటాపంచలవుతాయని సీనియర్‌ రష్యన్‌ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే ‘స్పుత్నిక్-వి’ టీకాకు సంభందించి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. మూడో దశలో దాదాపు 40 వేల మందిపై ఉపయోగిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. గత వారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన టీకాల నివేదికలో  ‘స్పుత్నిక్-వి’ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అడినోవైరస్‌ల నుండి తయారు తయారు చేసిన ఈ వ్యాక్సిన్ కు “స్పుత్నిక్-వి”అని పేరు పెట్టారు. కాగా ఇప్పటికే  పుతిన్‌ తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి వ్యాక్సిన్‌ వేయించినట్టు  రష్యా ప్రకటించింది.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండటంతో పాటు శరీరంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు దీటుగా పెరిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను మొదటి దశలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ చేయగా రెండో దశ పంపిణీ సెప్టెంబర్ నుండి జరగనుంది. ఈ వ్యాక్సిన్ ను రష్యాకు చెందిన గామలేయా ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసింది. ఈ టీకా  రెండో డోసులుగా ఉండనుంది. మొదటి టీకాలు వేసిన 21 రోజుల తర్వాత రెండో టీకాను వేయనున్నారు. రెండో డోస్‌తో వ్యాక్సిన్ రెట్టింపు సామర్థ్యం సంతరించుకుందని సమాచారం. అమెరికా ఆరోపిస్తున్నటు ఈ వ్యాక్సిన్ ను ఎవరి నుండి కాపీ చేయలేదని, జలుబును కలిగించే  అడినోవైరస్‌ల నుండి తయారు చేశారని స్పుత్నిక్‌ వార్తా సంస్థ ఇప్పటికే ప్రకటించింది. వ్యాక్సిన్ పై మరింత సమాచారం ఈ వారంలోగా అందనుందని తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad