Home రాజకీయాలు తెలంగాణా వార్తలు కేసీఆర్ మనవడి అరెస్ట్.. ఎందుకో తెలుసా?

కేసీఆర్ మనవడి అరెస్ట్.. ఎందుకో తెలుసా?

KCR Grandson Arrested In Pragathi Bhavan Case

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మనవడిపై కేసు నమోదైంది. దీంతో అతడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ వార్తతో ఒక్కసారిగా టీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. కానీ అసలు విషయం తెలుసుకుని వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రగతి భవన్ ముట్టడి కేసులో కేసీఆర్ మనవడు రితేష్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడి పేరును ఎఫ్ఐఆర్‌లో ఏ5గా నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు.

కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు కొడుకైన రితేష్, ఇటీవల పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఎన్‌ఎస్‌యూఐ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. బుధవారం నాడు ప్రగతి భవన్‌కు ఓ డీసీఎంలో చేరిన విద్యార్థి నాయకులు, ప్రగతి భవన్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇనుప గ్రిల్స్ దూకి ఓ విద్యార్థి లోపలికి వెళ్లేందుకు యత్నించగా, అప్రమత్తమైన పోలీసులు అతడితో పాటు అక్కడ ఆందోళన చేస్తున్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో రితేష్ కూడా వారిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు విద్యార్ధి నాయకులను అరెస్ట్ చేసి పోలీసు వ్యానులో గోషామహల్ పీఎస్‌కు తరలించారు. అయితే రితేష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో అతడి తల్లి రమ్యారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చట్టానికి ఎవరూ అతీతులు కారనే విషయం ఈ ఘటనతో మరోసారి రుజువైందని పలువురు అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad