దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. ఈ క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించింది. ఈ మేరకు అధికారిక మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. అనేక పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ.. రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిన అభ్యర్థినే ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నిక చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. ‘‘నేను చెప్పిన వ్యక్తినే ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారు. నా సహోదరి అయిన ఒడియా బిడ్డ ద్రౌపది ముర్మూను అభ్యర్థిని చేస్తారని నేను ముందే చెప్పాను. కొద్ది రోజుల క్రితమే నేను హింట్ ఇచ్చాను. వెంకయ్య నాయుడిని రాష్ట్రపతిని చేయొద్దని ఆనాడే చెప్పాను. ఇప్పుడు నేను చెప్పినట్లే గిరిజన బిడ్డ అయిన ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్థిని చేశారు’’ అని కేఏ పాల్ అన్నారు. ఇది కూడా చదవండి: Hanmakonda: నా భార్యకు న్యాయం చేయండంటూ సెల్ టవర్ ఎక్కిన భర్త! కారణం ఏంటో తెలుసా? ‘‘రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడిని చేయవద్దు నేను సూచించాను. నేను మొదటినుంచి షెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళలకు రాష్ట్రపతి ఇవ్వాలని బీజేపీకి చెప్పాను. ఒడిశాలోని ఓ షెడ్యూల్ కులానికి చెందిన ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం సంతోషం’’ అని పేర్కొన్నారు. మరి కేఏ పాల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: video: కాలేజీ ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్న MLA! అధికార గర్వం తలకెక్కిందంటూ నెటిజన్స్ ఫైర్..