Home రాజకీయాలు ఏపి వార్తలు పాపం జనసేన ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది ?

పాపం జనసేన ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది ?

janasena thumb

అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైకాపా పార్టీ అమరావతి రైతులకు వెన్నుపోటు పొడిచిందని సంచలన ఆరోపణలు జనసేన ఇప్పుడు గందరగోళంలో చిక్కుకుంది. సీఎం జగన్ 3 రాజధానులు విషయం ప్రకటించగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లో రాజధాని తరలింపు జరగదని చెప్తూ బీజేపీ పార్టీతో కలిసి మిత్రపక్షంగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమ కార్యచరణ సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారి మలుపు తిరిగాయి. రాజధాని విషయాన్ని ఢిల్లీ స్థాయికి చేర్చాలనుకున్న జనసేన ఇప్పుడు గందరగోళంలో చిక్కుకున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం బీజేపీ పార్టీనే.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రం హైకోర్టులో అఫిడవిట్‌ ఇచ్చినా సంగతి తెలిసిందే. “రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి రాదని కేవలం పది రాష్ట్రాల పరిధిలో మాత్రమే ఉంటుందని. అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో కూడా కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు సూచనలు తప్ప ఆదేశాలు జారీ చేయాలని తెలిపింది “ దీంతో రాజధాని అంశం పై బీజేపీ పార్టీ గానీ కేంద్రంగాని ఎటువంటి సాయం చేయలేదని తేలిపోయింది. ఇప్పుడు ఈ నిర్ణయం జనసేనకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మిత్ర పక్షం ఇటువంటి ప్రకటన చేయటం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేనట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన అధ్యక్షుడిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి రాజధాని అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అమరావతి రాజధాని రైతుల సమస్యలపై బీజేపీ–జనసేన ఉమ్మడిగా ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలన్న దానిపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చెప్పారు.దీనికి సంబంధించిన ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad