గుర్తింపు లేని పార్టీగా జనసేన. ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

Shock to Pawan Kalyan Janasena as an unrecognized party - Suman TV

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఇండియా కూడా ఒకటి. ఇక్కడ రూల్, రూలింగ్ అంతా పొలిటికల్ పార్టీలదే. మరి.. ఇలాంటి రాజకీయ పార్టీలు దేశంలో ఎన్ని ఉన్నాయి? ఆమ్మో.. వీధికి ఒక జెండా ఎగురుతున్న ఈ రోజుల్లో పొలిటికల్ పార్టీస్ ని లెక్క కట్టడం కష్టం అంటారా? అయితే.., ఎన్నికల సంఘం ఈ లెక్కను తేల్చింది. దేశంలో ఇప్పటివరకూ నమోదైన పార్టీల వివరాలను వెల్లడిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో ప్రాంతీయ పార్టీలు అయిన తృణమూల్‌ కాంగ్రెస్‌, బీఎస్పీ, భాజపా, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, ఎన్సీపీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి జాతీయహోదా కట్టబెట్టింది.

Shock to Pawan Kalyan Janasena as an unrecognized party - Suman TVమొత్తం 27 రాష్ట్రాల్లో 57 ప్రాంతీయ పార్టీలు ఉన్నట్లు లెక్క తేల్చింది. అదేంటి.. మిగతా చిన్న చితకా పార్టీలు చాలా ఉన్నాయి కదా? వాటి సంగతి ఏంటి అంటారా? వాటన్నిటిని గుర్తింపు లేని పార్టీలుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇలాంటివి మొత్తం 2,796 గుర్తింపులేని పార్టీలు ఉన్నాయి. కానీ.., ఇందులో షాకింగ్ మ్యాటర్ ఏమిటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనను గుర్తింపు లేని రాజకీయపార్టీల జాబితాలో చేర్చింది ఎన్నికల సంఘం. జన సైనికులకు ఇంకా అవమానకరమైన విషయం ఏమిటంటే వారి పార్టీ సింబల్ అయిన గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్స్‌ లిస్ట్‌లో ఉంచింది. కానీ.. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని తెదేపా, తెరాస, వైకాపా, ఎంఐఎంలకు ప్రాంతీయ పార్టీ హోదా ఉన్నట్లు తెలిపింది. దీంతో.., ఎన్నికల సంఘం నిర్ణయం జన సైనికులకు షాక్ ఇచ్చినట్టు అయ్యింది. మరి.. జనసేన గుర్తింపు లేని పార్టీగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.