నిన్నటివరకు జగన్ ని మాత్రమే టార్గెట్ చేసిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఆయన నియోజకవర్గం “పులివెందుల”ను కూడా టార్గెట్ చేశాడని స్పష్టంగా అర్దం అవుతుంది. APకి ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఆలోచన తప్ప పులివెందులకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన కూడా జగన్ కు లేదని.. ప్రతి ఊరికి నీరిస్తే జగన్ సహించలేకపోతున్నాడని ఎన్నికల ప్రచారంలో బాగంగా AP సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
చిత్తూరు జిల్లా, “చంద్రగిరి”లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. పులివెందులలో జగన్ గెలవలేడు.. ఇక్కడి ప్రజలకు ఆయనపై ఎంత వ్యతిరేకత ఉందో ఇటీవల అక్కడ నిర్వహించిన TDP మీటింగ్ కు వచ్చిన ప్రజల రెస్పాన్స్ చూస్తే ఆ విషయం అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
రౌడీయిజం ఎల్లకాలం నడుస్తుందని జగన్ అనుకుంటున్నాడు.. అది ప్రతిసారి సాధ్యపడదు.. ఈ ఎన్నికలతో YCP శాశ్వతంగా మూతపడుతుంది. ఆ పార్టీలో YS జగన్ పెద్ద రౌడీ అయితే, చెవిరెడ్డి చిన్న రౌడీ అని, ఇలాంటి ఆకు రౌడీలను నేను ఎంత మందిని చూసుంటాను.. కాబట్టి ఇలాంటి వారిని ఓడించి ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు.