వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రతి సభలోనూ,, సమావేశంలో చెప్పే నినాదం ఒక్కటే.. జగన్ అనే వాడు మాట తప్పడు.. మడమ తిప్పడు అని, ఆ నినాదాన్నే ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేలా జగన్ తన నిర్ణయాలను అమలు చేస్తున్నాడు. అందులో భాగంగానే, ఆదివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వేదికగా జరిగిన వైసీపీ బీసీ గర్జన సభలోనూ జగన్ తనపై ప్రజల్లో మరింత నమ్మకం కలిగేలా జంగా కృష్ణమూర్తిని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా ఎంపికకు కారణమిదే..
డిసెంబర్ 15, 2016న గుంటూరులో నిర్వహించిన వైసీపీ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ బీసీ నేత జంగా కృష్ణమూర్తికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించారు. తన తండ్రి (దివంగత సీఎం వైఎస్ఆర్) మరణించిన తరువాత జంగన్న తనకు నాన్నలా నిలబడి సహకరించారని, ఎట్టి పరిస్థితుల్లోనూ జంగన్నకు అన్యాయం జరగదని జగన్ అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలలకే జంగన్నకు సముచిత స్థానం కల్పించి నా పక్కనే కూర్చోబెట్టుకుంటానంటూ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
నాడు ఇచ్చిన ఆ మాట ప్రకారం వైఎస్ జగన్ తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే జంగా కృష్ణ మూర్తిని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు బీసీ గర్జన సభ సాక్షిగా ప్రకటించారు. ఇలా జంగా కృష్ణమూర్తికి ఇచ్చిన హామీ మేరకు జగన్ తన మాటను నిలబెట్టుకున్నాడు. వైఎస్ జగన్ అనే వాడు మాట తప్పడు, మడమ తిప్పడు అన్న నినాదాన్ని అక్షరాల నిజం చేశాడు.