Home రాజకీయాలు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి నేమ్ ప్లేట్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్స‌య్యారు..!

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి నేమ్ ప్లేట్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్స‌య్యారు..!

గ‌త రెండు మూడు రోజుల నుంచి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వ‌ర్యులు అంటూ ముద్రించిన నేమ్ ప్లేట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఇదే నేమ్‌ప్లేట్‌పై ఏపీ ప్ర‌ధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ వ‌ర్గాల నుంచి విభిన్న వాద‌న‌లు విన‌వ‌స్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి ఉన్న అధికార దాహం ఎంతో ఈ నేమ్‌ప్లేట్ చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంద‌ని టీడీపీ శ్రేణులు మాట‌ల యుద్ధం మొద‌లు పెట్ట‌గా, అందుకు బ‌దులుగా వైసీపీ వ‌ర్గాలు బ‌దులిస్తూ ఆ నేమ్‌ప్లేట్ వెనుక ఎవ‌రెవ‌రు ఉన్నారో.. జ‌గ‌న్‌ను నేరుగా ఎదుర్కోలేక ఇలాంటి ట్రిక్కుల‌కు పాల్ప‌డితే ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితిలో లేరంటూ హెచ్చ‌రిస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో వైసీపీ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా టీడీపీపై మాట‌ల‌యుద్ధాన్ని వేగ‌వంతం చేశారు. ఈ రోజుల్లో ఒక వ‌స్తువు త‌యారు చేయాలంటే బీభ‌త్సంగా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని, ఒక వేళ వైఎస్ జ‌గ‌న్ నిజంగానే నేమ్‌ప్లేట్‌ను త‌యారు చేయించుకుని పెట్టుకుంటే.. ఆ నేమ్‌ప్లేట్‌ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడ‌తాడా..? అలా చేసేందుకు మీలా మూర్ఖులు కాదంటూ టీడీపీకి కౌంట‌ర్ ఇస్తున్నారు.

ఒక వేళ వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ‌నో.. జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తినో.. జ‌గ‌న్ సోద‌రి వైఎస్ షిర్మ‌ల‌నో త‌యారు చేయించి ఉంటే ఆ నేమ్‌ప్లేట్‌ను సోష‌ల్ మీడియాలో పెట్టాల్సిన అవ‌స‌రం వారికేముంది..? అంటూ టీడీపీ శ్రేణుల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న లాజిక్‌ల‌ను ప‌క్క‌న పెట్టేసి ఓట‌మి భ‌యంతో వైఎస్ జ‌గ‌న్‌పై రివ‌ర్స్ ప్ర‌చారం చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad