మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ చూస్తుంటే జగన్, ఆయన అనుచరులు, అలాగే YS కుటుంబ సభ్యులా చుట్టే తిరుగుతుంది. అందులో బాగంగానే ఈ కేసులో జగన్ ముఖ్య అనుచరుడైన “దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి”ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారమే కడప పార్లమెంట్ ఆర్జేడీ అభ్యర్థిగా “శివశంకర్ రెడ్డి” నామినేషన్ వేయడం.. ఆ వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఇప్పటికే శివశంకర్ రెడ్డిని పోలీసులు రెండుసార్లు విచారించారు. పులివెందులకు చెందిన నాగప్ప, ఆయన కుమారుడు శివను కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరితోపాటు మరో 15 మందిని అదుపులోకి తీసుకుని కడపలోని ఓ రహస్య స్థావరంలో విచారిస్తున్నారు. వివేకా కేసులో ఇప్పటికే 40 మంది సాక్షులను పోలీసులు విచారించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీలు కోణంలో సిట్ విచారణ జరుపుతోంది.
ఇప్పటికే వివేకానందరెడ్డి ముఖ్య అనుచరులు అయిన ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వరెడ్డి, కిరాయి హంతకులు శేఖర్ రెడ్డి ఈ హత్య కేసులో ప్రధాన నిందితులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితులను అందరినీ క్లుప్తంగా ప్రశ్నించి.. సోమవారం లోపల కొందరు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.