Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు అత్యంత తక్కువ ధరకు రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్

అత్యంత తక్కువ ధరకు రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్

Remdesivir Pricing 1

ప్రస్తుతం కరోనా కట్టడి ఉన్న ఏకైక మందు రెమ్‌డిసివిర్ మాత్రమే. అమెరికా డ్రగ్ కంట్రోల్ అధారిటీ  రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్ కరోనా వైరస్ పై ప్రభావాన్ని చూపడంతో పాటు మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పడంతో ప్రపంచ దేశాలు ఈ మందును సంజీవనిగా భావిస్తున్నాయి. దీనితో ఒక్కసారిగా రెమ్‌డిసివిర్ కు భారీ గిరాకి ఏర్పడింది. భారత్ దేశంలో ఈ మందును బ్లాక్ మార్కెటింగ్ చేయడంతో పాటు అక్రమంగా తరలిస్తున్నారు. భారత్ మార్కెట్లో  రెమ్‌డిసివిర్ ధర పదివేలకు పైగానే ఉంది. ఇక బ్లాక్ మార్కెట్లో అయితే పాతిక వేల నుండి 30 వేల వరకు ధర పలుకుతుంది. వాస్తవానికి ఈ మందు అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం గిలీద్ సైన్స్ తయారుచేసింది. రెమ్‌డిసివిర్ యాంటీ వైరల్ డ్రగ్. దీనిని  ఎబోలా వైరస్ ను నివారించడం కోసం వినియోగిస్తారు. క్రితం వరకు అధిక ధరలో ఉన్న ఈ డ్రగ్ ను భారత్‌ కు చెందిన జైడస్ కాడిలా అతి తక్కువ ధరకు తీసుకువచ్చింది.

తాజాగా రెమ్‌డిసివిర్ జనరిక్ వెర్షన్‌ జైడస్ కాడిలా ఫార్మా ఆవిష్కరించింది. 100 ఎంజీ ఇంజక్షన్‌‌ను రూ. 2,800కు అందజేయనున్నట్లు తెలిపింది.ఈ మందు ‘రెమ్‌డాక్’ పేరిట మార్కెట్లో అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే రెమ్‌డిసివిర్ జనరిక్ వెర్షన్‌ ను హెటిరో ల్యాబ్స్, సిప్లా, మైలాన్ ఎన్వీ, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్‌‌ సంస్థలు  విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో జైడస్ కాడిలా వచ్చి చేరింది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న ఇతర రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్ల కంటే ‘రెమ్‌డాక్’ అత్యంత తక్కువ ధరకు లభించనుంది.

గిలీద్ సైన్సెస్ రెమ్‌డిసివిర్ యొక్క జనరిక్ వెర్షన్‌ మోత్తం 127 దేశాల్లోని వివిధ ఫార్మా సంస్థలతో ఉత్పత్తి చేస్తుంది. కరోనా సోకినా రోగులకు ఈ మందు ఇవ్వగా అత్యంత వేగంగా కోరుకుంటున్న విషయం ఇప్పటికే తెలిసిందే. ‘రెమ్‌డాక్’ అతి తక్కువ ధరకు లభించడం కరోనా రోగులకు కలిసి వచ్చే అంశం. దీని ద్వారా రికవరీ రేటు పెరిగే అవకాశం ఉంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad