
ప్రపంచంలో వింతైన ఘటనల గురించి మనం తెలుసుకున్నప్పుడు నోరెళ్లబెట్టడం ఖాయం. అయితే ఈ క్రమంలో మనుష్యులే కాకుండా జంతువుల్లో కూడా వింతైనవి ఉంటాయి. అయితే కొన్ని విషయాలు మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేయడమే కాకుండా నమ్మశక్యం కాని విధంగా ఉంటుంటాయి. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. ఎవరైనా మేకలు, గొర్రెలను కొనేందుకు వాటిని విక్రయించే వారితో బేరం ఆడుతుంటారు.
వారు చెప్పినరేటుకు అటూఇటుగా ఎంతో కొంత ముట్టజెప్పి వాటిని సొంతం చేసుకుంటారు. అయితే ఓ గొర్రె అమ్ముడుపోయిన రేటు చూసి యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ విషయం గురించి తెలుసుకుని, ఇది ఎక్కడ జరిగిందా అంటూ వారు ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ గొర్రె ఎంతకు అమ్ముడు పోయిందా అని మీరు ఆలోచిస్తున్నారా.. ఏకంగా రూ.3.5 కోట్లకు అమ్ముడుపోయిన ఈ గొర్రె ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొర్రెగా రికిర్డుకెక్కింది.
స్కాట్లాండ్లో జరిగిన స్కాటిష్ లైవ్‌స్టాక్ వేలంలో ఈ డైమండ్ గొర్రె 3,65,000 పౌండ్లకు అమ్ముడుపోవడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. నెదర్లాండ్‌లోని టెక్సెల్ అనే మేలిమి జాతికి చెందిన ఈ గొర్రె మాంసంకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండటంతో వాటికి భారీ రేటు ఉంటుందని, వాటిని బ్రీడింగ్ కోసం ఎక్కువగా వినియోగిస్తారని అక్కడి ప్రజలు అంటున్నారు. ఇక ప్రపంచరికార్డును క్రియేట్ చేసిన ఈ డైమండ్ గొర్రె పేరు కూడా డైమండ్ కావడం కొసమెరుపు.