Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు భారత్ చాలా పెద్ద తప్పు చేసింది:టెడ్రోస్ హెచ్చరిక

భారత్ చాలా పెద్ద తప్పు చేసింది:టెడ్రోస్ హెచ్చరిక

VBK TEDROSADHANOMGHEBREYESUS AP

భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతున్న సమయంలో అన్‌లాక్ ప్రక్రియను చేపట్టడం సరైన విధానం కాదని ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అద్నమ్ ఘేబ్రెయేసిస్ అన్నారు. తాజా సడలింపుల్లో భాగంగా భారత్ మెట్రో రైలు పునరుద్ధరణ మరియు స్వేచ్ఛాయుత అంతరాష్ట్ర ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు ఇతర దేశాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ విషయంపై  స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని. ఇటువంటి సమయంలో అన్‌లాక్ ప్రక్రియను చేపడితే.. ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అన్‌లాక్ ప్రక్రియను మొదలుపెట్టడం సరైన విధానం కాదని వారు అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశం కూడా కరోనా మహహ్మారి అంతమైందని భావించవద్దని అన్నారు. ప్రభుత్వాలు అన్‌లాక్ విధించినప్పటికీ ప్రజలు జాగృతంగా ఉండటంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాలు రోగాలను గుర్తించి సరైన చికిత్స అందించడం ద్వారానే ఈ మహమ్మారి చెక్ చెప్పవచ్చని టెడ్రోస్ సూచించారు. మరోవైపు దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 78,357 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య  37లక్షలు దాటింది.

ప్రస్తుతం 8,01,282 యాక్టివ్‌ కేసులు ఉండగా, 29,01,909 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో 1,045 మృతి చెందగా ఇప్పటి వరకు 66,333 మంది వైరస్‌తో మరణించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ తెలిపింది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad