Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు రష్యాకు డబ్ల్యూహెచ్‌వో షాక్

రష్యాకు డబ్ల్యూహెచ్‌వో షాక్

918803 913583 covid 19 vaccine

రష్యా తయారుచేసిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన కరోనా వ్యాక్సిన్ ప్రయోగ నివేదికలో స్పుత్నిక్‌ వి పేరును ప్రకటించలేదు. ప్రస్తుతం ప్రయోగ ధశలో తయారవుతున్నవ్యాక్సిన్‌ సంస్థల్లో పెట్టుబడులు మరియు ఒప్పందాలు చేసుకోవడానికి గాను డబ్ల్యూహెచ్‌వో ప్రపంచంలోని వివిధ సంస్థలకు చెందిన 9 టీకాలను గుర్తించింది. ఇవి చివరి దశలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.అయితే ఇప్పటికే విడుదలైన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ ఇందులో లేదు.

దీనిపై స్పందించిన డబ్ల్యూహెచ్‌‌వో సీనియర్‌ సలహాదారు డాక్టర్‌ బ్రూస్‌ అయల్వార్డ్‌ “ రష్యాతయారుచేసిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ పై మాకు తగినంత సమాచారం లేదు. అందుకే ఈ వ్యాక్సిన్ సమర్థతపై కచ్చితమైన నిర్ధారణకు రాలేకపోతున్నాము. ప్రస్తుతం వ్యాక్సిన్ ఏ దశలో ఉందో కూడా మాకు తెలియదు. గత కొద్ది రోజులుగా మేము రష్యాతో సప్రదింపులు జరుపుతున్నామన్నారు. మరోవైపు రష్యా వ్యాక్సిన్ పై  ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు పెరుగుతున్నాయి. మూడో దశ మానవ ప్రయోగాలు పూర్తి కాకుండానే వ్యాక్సిన్ విడుదల చేయడంపై అనేకమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన ప్రయోగ ఫలితాలేవి విడుదల కాకపోవడంతో మెజారిటీ దేశాలు స్పుత్నిక్‌ సామర్థ్యం, భద్రత వంటి అంశాల పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా మాట్లాడుతూ “ఎక్కువమంది పటిక ప్రయోగించకపోతే ఫలితాలు సరిగ్గా రావని. అందుకే మూడో దశ మానవ ప్రయోగాలు చాలా అవసరమని” అన్నారు.  డబ్ల్యూహెచ్‌వో వ్యతిరేకతను తెలుపుతున్నపటికీ రష్యా ఈ వ్యాక్సిన్ ను 20 దేశాలకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భారత్ కూడా ఉంది.  

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad